Health Benefits : ప్రతి ఒక్కరు రోజు యోగ చేయడం వలన మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. యోగ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఈ బిజీ లైఫ్ లో చాలామంది తన ఆరోగ్యం పట్టించుకోవడం లేదు. తృప్తిగా తినటానికి కూడా వీలు లేకుండా జీవిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా యోగా, వ్యాయామాలు , ఎక్ససైజ్, వాకింగ్ రోజు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజు యోగా చేయడం వల్ల పనిలో ఒత్తిడి తగ్గటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కండరాలను బలంగా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనంగా మారుతాయి. దీనికి కారణం ఎముకల్లో ఉండే కాలుష్యం తగ్గటం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే రోజు యోగా చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి ఎముకలకు సంబంధించిన రోగాలు రావు. యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగ ఎలాంటి రోగాలు బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా సోకవు. ఇందులో త్రికోణసానం, ఆసనాలు వేయాలి. నిద్ర సమస్య ఉన్నవారు యోగా చేయడం వల్ల ఈ సమస్య సైతం తగ్గించవచ్చు.
Health Benefits : గుండె జబ్బులకు, హైబీపీ కి యోగా మంచి దివ్య ఔషధం.

యోగా చేయడానికి రోజు టైం లేని వాళ్ళు వారానికి రెండు సార్లు చేసిన మంచి ఫలితం ఉంటుంది. అధిక ఒత్తిడి దూరమవ్వడానికి శవాసనం వేయాలి. రక్తపోటును తగ్గిస్తుంది. రోజు యోగా చేయడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శరీరంలో అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. వీటి కోసం వీరభద్రసానం , ప్రాణాయానం చెయాలి. యోగా చేయటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పని తీరు మెరుగుపరు పరుస్తుంది. కండరాలు గట్టి పడతాయి. యోగాతో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం జానా శిరసానస వేయాలి. మతిమరుపుసమస్యను తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందుకోసం బాలసన ఆసనం వేయాలి.