God Father : మెగాస్టార్ చిరంజీవి మళయాళ లో లూసిఫర్ రీమేక్ గా వస్తున్నతువంటి చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నాడు. ఆర్ బీ చౌదరి, N.V ప్రసాద్ మరియు రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఎస్ తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకి ముందుగా రామ్ చరణ్ ను అనుకున్నారు. తరువాత అల్లు అర్జున్ ని ప్రపోజ్ చేయగా చివరగా సల్మాన్ఖాన్ ని ఫైనల్ చేసి ఈ పాత్రని తెరకెక్కించడం జరిగింది.
గాడ్ ఫాదర్ కి సంబంధించి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ లో మెగాస్టార్ తన న్యూ లుక్ లో సునీల్ కార్ డోర్ తీయగా చిరు ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. చిరంజీవి స్టైలిష్ నడకతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది. టీజర్ లో చిరు స్టైల్ చూసిన ఫ్యాన్స్ అన్నయ్య స్టైల్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో పండగ చేస్తున్నారు. ఈ టీజర్ను ట్విట్టర్ లో ది బాస్ ఇస్ ఇయర్ టు రూల్ ఫరెవర్ అంటూ ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేయడం జరిగింది.
God Father : చిరు ఎంట్రీ చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బుంప్స్.

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో చిరు ఫాన్స్ ఆయనను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇదే కదా చిరంజీవి అభిమానులకు కావాల్సింది. ఆయన స్టైల్ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఈ టీజర్ లో చివరగా విజయదశమి 2022 అంటూ రిలీజ్ క్లూ ఇవ్వడం జరిగింది. అంటే గాడ్ ఫాదర్ సినిమా ఈ దసరా పండక్కి అందరితో సందడి చేయనుంది. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి ఈ ఫస్ట్ లుక్ తో పండుగ ముందుగానే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి.