Health benefits :పూర్వకాలం నుండి ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకుంటున్నారు. అన్ని వంటల్లో కరివేపాకు వేసి వండుతారు. గ్రామాలలో కరివేపాకు మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది. కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో సంపదలు, మంచి ఆరోగ్యం అంతేకాకుండా ఆదాయం కూడా సమృద్ధిగా ఉంటుంది అని చాలామంది నమ్మకం. ఆర్దిక సమస్యలతో బాధపడేవారు వ్యాపారంలో నష్టం కలిగిన వారు, అనారోగ్యంతో బాధపడేవారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆదాయం పెరిగి, ఆరోగ్యంగా ఉంటారు.ఈ మొక్కను ఆయుర్వేద రెమెడీస్ లో కూడా ఉపయోగిస్తారు. కానీ ఒక్కొక్కరికి మనం సంపాదించే డబ్బు ఒక్కొక్కసారి ఆగిపోతుంది, లేదా మరికొందరకు సంపాదించిన డబ్బు నిలకడగా బాధపడుతుంటారు.
అటువంటివారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్దిక సమస్యల నుండి కొద్దిగా ఉపసమనం కలుగుతుంది. ఒకప్పుడు బాగా ఆదాయం ఉండి ఇప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ చెట్టుని ఇంటి ఆవరణలో పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు కరివేపాకు చెట్టు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ మొక్క విషవాయువులను గ్రహించి పరిశుభ్రమైన గాలిని మనకు అందిస్తుంది. గాలి ద్వారా సోకే వ్యాధులనుండి కాపాడుతుంది.ఎవరి ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ,తులసి చెట్టు ,కలమంద చెట్టు ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవు. వాతావరణ మార్పులు వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటాం.
Health benefits :ఆ గృహములో ఏ విధంగా ఉంటుందో తెలుసా?

కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట ఈ మొక్క ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ,మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కరివేపాకుని ఏ విధంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. కరివేపాకుని కూరల్లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆకులను శుభ్రంగా కడిగి నీడలో ఆరపెట్టి ఎండిన తర్వాత మెత్తగా చేసుకుని ఈ పౌడర్ ని గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని రోజు తీసుకోవచ్చు. కరివేపాకు పొడి ,మునగాకు పొడి రెండు కలిపి గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపరచడమే కాక సర్వరోగ నివారణగా పనిచేస్తాయి. కరివేపాకుల జ్యూస్ ని రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల వాతావరణం లో ఏర్పడ్డ బ్యాక్టీరియా, వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
కరివేపాకు మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది. కారపు పొడిలో కరివేపాకును కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మజ్జిగలో కరివేపాకుల రసాన్ని కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. ఈ ఆకుల రసంలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారంలో కరివేపాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రోజు 4 ,5 రెబ్బలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి ,రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా కరివేపాకు జుట్టు సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చర్మం మెరిసేలా ఆరోగ్యంగా ఉండాలంటే కరివేపాకు తప్పనిసరిగా తీసుకోవాలి. కరివేపాకు ఆర్థికపరంగా గాను, ఆరోగ్యపరంగా ఎంతో సహాయపడుతుంది. కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.