Health Tips : హై బీపీ ఉంటే కిడ్నీలకు ప్రమాదం… నివారణ ఇలా…

Health Tips : అధిక రక్తపోటుతో ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. అధిక రక్తపోటు వలన కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. అందుకనే అవసరానికి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. హై బీపీ ఉంటే కంటి ఇబ్బందులు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, గుండె దడ మొదలైన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉంటే కిడ్నీలు దెబ్బతింటాయి.

హైబీపీ వలన కిడ్నీలు సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. చాలామందికి కిడ్నీలు పాడైనట్లుగా కూడా తెలియదు. 80 నుంచి 90% కిడ్నీలు పాడిన ఎలాంటి లక్షణాలు కనిపించవు.ఒకసారి కిడ్నీలు పాడితే చాలా సమస్యలు వస్తాయి. కాళ్లలో వాపు వస్తుంది. రక్తపోటు అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. ఆకలి ఉండదు. తరచు వాంతులు అవుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు పరీక్షలు చేయించుకోవాలి.

Health Tips : హై బీపీ ఉంటే కిడ్నీలకు ప్రమాదం… నివారణ ఇలా.

Health tips high blood pressure effects kidneys
Health tips high blood pressure effects kidneys

ఉప్పుని ఎక్కువగా తినకూడదు. దీన్ని పూర్తిగా తగ్గించాలి. హై బీపీ ఉన్నవారు ఎటువంటి నొప్పి మాత్రలు వేసుకోకూడదు. డాక్టర్స్ సలహా లేకుండా వాడితే చాలా సమస్యలు వస్తాయి. హైబీపీ ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే టాబ్లెట్స్ వేసుకోవాలి. మరి అధికంగా రక్తపోటు ఉంటే డాక్టర్ సలహాతో రెండు పూటలా మందులు వేసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హై బీపీ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసుకుందాం.

హై బీపీ ఉన్నవారు పొటాషియం అధికంగా గల ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో, టమాటాలో, బంగాళదుంపల్లో, చిలకడదుంపల్లో ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి కూరగాయలను తీసుకోవడం మంచిది. ఇక పండ్లలో అయితే అరటి పండ్లు, అవకాడో, ఆరెంజ్ లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇలా పొటాషియం ఎక్కువ గల ఆహార పదార్థాలను తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటే కిడ్నీలు పాడవకుండా ఉంటాయి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి