Headache Relief tips : మనకి కొన్నిసార్లు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక సాధారణమైన వ్యాధి. ఒక్కోసారి తలనొప్పి వస్తే దాని తగ్గించడం అంత ఈజీ కాదు. అయితే తలనొప్పి తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కొంతమందికి మైగ్రేన్ సమస్యలు ఉంటాయి. తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి యాంటీబయోటిక్ తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందుకే తలనొప్పిని తగ్గించుకోవడానికి తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పికి త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి. తులసి ఆకులను నమిలి రసం తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే ఓమలో థైమోల్ కంటెంట్ ఉంటుంది. ఓమను కొద్దిగా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఓమకు జీర్ణాశయ శక్తి కూడా ఉంటుంది. అందుకే ఇది మంచి హోం రెమిడీ. ఎప్పుడు అందరి ఇళ్లలో అందుబాటులో కూడా ఉంటుంది. అలాగే పుదీనాలో అనేక ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. పుదీనా టీ తాగినప్పుడు తలనొప్పి తగ్గుతుంది. పుదీనా అన్ని కాలాలలో లభిస్తుంది. దీని ధర కూడా తక్కువగా ఉంటుంది. అల్లం తలనొప్పిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ వేడి నీళ్ళలో అల్లం వేసి మరిగించి కొద్దిగా చల్లారాక త్రాగితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
తలనొప్పి బాగా వచ్చినప్పుడు ఎక్కువ మంచినీళ్లను త్రాగాలి. నీళ్లు బాగా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది. వైద్యులు చెప్పిన దాని ప్రకారం తలనొప్పి ఉన్నప్పుడు ఎక్కువ శాతం నీరు త్రాగాలి. దీంతో తలనొప్పి సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది. అల్లం తలనొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఒక ఇంచు అల్లాన్ని నీళ్ళల్లో వేసి కాగా పెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం వాంతులు కాకుండా కూడా నివారిస్తుంది. లవంగాలలో యూజినాల్, గల్లిక్ యాసిడ్ ఉంటాయి. లవంగాలను తీసుకుంటే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతో ఈజీగా తలనొప్పి తగ్గించుకోవచ్చు.