Guppedanta Manasu 21 October Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 587 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దేవయాని ,జగతి ,మహేంద్ర లను ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. జగతి మహేంద్ర మౌనంగా ఉంటారు. అప్పుడు దేవయాని అసలు రిషి సంతోషం దూరం కావడానికి కారణం మీరే గురుదక్షిణ అనే ఒప్పందం పెట్టకపోతే ఈపాటికి పెళ్లి చేసుకొని సంతోషంగా గడిపే వాళ్ళు రిషి వసుధారాలు అంటూ.. ఎప్పుడో ఉదయం వెళ్తారు.. మళ్ళీ నైట్ వస్తారు. రిషి మనసేంటో తెలుసుకోరు.. రిషి ఎక్కడికెళ్తున్నారో తెలుసుకోరు.. మీ ధోరణ మీదే మీ గోల మీదే అసలు మీరు ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటూ.. ధరణి అని పిలుస్తూ ఈ ఇంట్లో స్వార్ధాలు ఎక్కువవుతున్నాయి ఒక్కొక్కళ్ళకి అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మహేంద్ర వదిన గారు అన్న మాటలకి మనం పరిష్కారం ఆలోచించాలి.
జగతి అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి మహేంద్రా ని రూమ్ లోకి తీసుకెళ్తుంది. కట్ చేస్తే రిషి వసుధారాలు ప్రేమగా మాట్లాడుకుంటూ… కలిసి కారులో వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే జగతి మహేంద్ర రూమ్లో కూర్చుని రిషి అన్న మాటల్ని దేవయాని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ.. మహేంద్ర రిషికి ఫోన్ చేస్తాడు కానీ రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. అప్పుడు మహేంద్ర వదిన గారు చెప్పినట్లుగానే రిషికి మనమే శత్రువులమవుతున్నాం రిషి ఫోన్ మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అని జగతితో చెప్తూ ఉంటాడు. ఇక వదినగారు అన్న మాటలకి మనం పరిష్కారం ఆలోచించాలి. అనుకుంటూ జగతి నేను నీకు ఒక విషయం చెప్తాను. విను అని గట్టిగా అంటూ ఉంటాడు. కట్ చేస్తే రిషి వసుధారాలు ఒక చెట్టు కింద కూర్చుని ఒకరికి ఒకళ్ళు ఆనుకొని ఊగుతూ సరదాగా ప్రేమగా గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో వసుధార రిషి ఒడిలో పడిపోతుంది.
అప్పుడు ఒకరిని ఒకరు ప్రేమగా రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక్కసారిగా లేచి పక్కకి వెళ్తూ సిగ్గు పడుతూ ఉంటారు. కట్ చేస్తే మహేంద్ర ఇక మనం ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే దీనికి పరిష్కారం జగతి అని అనుకుంటూ రిషి మహేంద్ర కలిసి దిగిన ఫోటోను చూస్తూ మహేంద్ర ఏడుస్తూ నేను రిషి ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. జగతి కానీ ఇప్పుడు ఉండవలసి వస్తుంది నేను మారిపోయాను అంటున్నాడు రిషి మారిపోవడం కాదు పారిపోతున్నాను అని ఏడుస్తూ ఆ ఫోటోని తీసుకొని తన చొక్కాలు దాచుకొని ఆ ఫోటో ఫ్రేమ్ పైన ఏదో రాసి ఇక జగతిని తీసుకొని వెళ్ళిపోతూ ఇంటిని చూస్తూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తుంటారు.. కానీ అదంతా చూస్తున్న దేవయాని మాత్రం సంతోషంలో తేలిపోతూ ఉంటుంది. కట్ చేస్తే రిషి వసుధారాలు ప్రేమగా మాట్లాడే మాటల్లో వసుధార నా పేరుని మీ ఫోన్లో పొగరు అని ఎందుకు పెట్టుకున్నారు సార్ అని అడుగుతుంది. అప్పుడు రిషి అందరి ఫోన్లో వసుధార అని ఉంటుంది. అందరూ పిలిచే పేరు వసుధార అందుకనే నేను స్పెషల్ గా నీ పేరుని పొగరు అని పెట్టుకున్నాను నువ్వు నాకు స్పెషల్ గా ఉండాలి అని అంటూ ఉండగా… వసుధార ఒక్కసారిగా రిషి భుజంపై వాలి నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నాకు ఇలాంటి సమయాలలోనే చాలా భయంగా ఉంటుంది. అని అంటాడు. అప్పుడు వసుధరా అదేంటి సార్ అని అడగగానే… నేను బాగా ఇష్టపడే వాళ్ళు నాకు దూరమవుతారేమో అని భయమేస్తుంది.
నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం నేను మా డాడీని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను.. తను కూడా అలాగే అని మహేంద్ర గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు వసుధార అలా ఏమి ఉండదు అని తనకి ధైర్యం చెబుతూ మళ్లీ తన భుజంపై పడుకొని ప్రేమగా తనకి మాటలు చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే జగతి మహేంద్ర వెళ్ళిపోతూ ఉంటారు. రిషి వసుధారాలు కూడా ఇంటికి వస్తూ ఈరోజు ఎందుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అని రిషి వసుధారతో అంటుంటాడు. అప్పుడు వసుధార కూడా అవును ఈరోజు పట్టరాని సంతోషం అనిపిస్తుంది అంటుంది. కానీ జగతి మహేంద్ర వెళ్తూ మహేంద్ర నాకు గుండెల్లో ఏదో బరువు పెట్టినట్టుగా బాధగా ఉంది జగతి అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి భరించాలి మహేంద్ర తప్పదు అని అంటుంది. అప్పుడు మహేంద్ర అవును రిషి హ్యాపీగా ఉండాలంటే ఈ బాధ తప్పదు.. కానీ రిషి ని వదిలి నేను ఉండడమేంటి అని బాధపడుతూ ఉంటాడు. ఇంకొకపక్క రిషి వసుధారాలు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే…