Health Facts : నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ తో చాలా రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్ వండే విధానంలోనే ఆరోగ్యం ఉంటుంది. చాలామంది ఫ్రైడ్ చికెన్ ఇష్టపడుతుంటారు. అయితే దీనికంటే ఉడికించిన చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చికెన్ ని కొనేముందు కొన్ని రకాల జాగ్రత్తలు వహించాలి. ముందుగా ఫ్రెష్ గా ఉండే చికెన్ కొనుగోలు చేయాలి. ఇంటికి తీసుకొచ్చాక దానిని శుభ్రంగా కడగాలి. అయితే రుచి కోసం డీప్ ఫ్రై చేయడం కాకుండా ఉడికించినది తినాలి. మార్కెట్లలో రెడ్ మీట్, వైట్ మీట్ అని అమ్ముతుంటారు.
అయితే రెడ్ మీట్ అంటే మేక మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం, ఎద్దు మాంసం ఇవన్నీ కూడా రెడ్ మీట్ కిందికి వస్తాయి. వైట్ మీట్ అంటే చికెన్ , గుడ్లు, చేపలు వీటిని వైట్ మీట్ అంటారు. రెడ్ మీట్ తింటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వైట్ మీట్ తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎక్కువగా ఎక్ససైజ్ చేసేవారు గుడ్లు, చేపలు, చికెన్ ఎక్కువగా తీసుకుంటారు. ఇక మనం రోజు తీసుకునే కూరగాయలలో కన్నా చికెన్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే చికెన్ ఫ్రై చేయకుండా ఉడికించి తినడం వలన అధిక మొత్తంలో ప్రోటీన్స్ అందుతాయి. చికెన్ లో ఆయిల్ వేయకుండా ఉడకబెట్టుకుని తినడం వలన గుండె సంబంధిత సమస్యలు రావు.
చికెన్ లో ఉండే అమైనో ఆసిడ్స్ పిల్లల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు గ్రిల్డ్ చికెన్ తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు . అయితే చికెన్ ఎక్కువగా తీసుకోకూడదట. దీని వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు చెబుతున్నారు. నాటు కోళ్లను ఎక్కువగా తింటే ఏం కాదు కానీ ఫారం కోళ్లను ఎక్కువగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. ఎక్కువసార్లు చికెన్ ను తింటే డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చికెన్ పై ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంటుంది. నిలువ చేసిన చికెన్లపై ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా ఉండే చికెన్ తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు