Women : హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి శుభకార్యానికైనా కొబ్బరికాయని కొడుతుంటారు. కొబ్బరి నీరు చంద్రుడికి చిహ్నంగా భావిస్తారు. దానిని దేవుడికి సమర్పించడం వలన సుఖం, శ్రేయస్సు లభిస్తాయి. అదే సమయంలో ఇది దుఃఖం, బాధలను కూడా తొలగిస్తుంది. అయితే హిందూమతంలో స్త్రీలు కొబ్బరికాయని కొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరికాయ ఒక విత్తనం. స్త్రీలు సంతానానికి కారకులు. ఒకే విత్తనం నుంచి సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే స్రీలు కొబ్బరికాయ కొట్ట కూడదని అంటారు.
అయితే మహిళలు కొబ్బరికాయలు కొట్టడం వలన సంతాన విషయంలో ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు. అందుకే మహిళలు కొబ్బరికాయ కొట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా చోట్ల మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించేదని సూచిస్తుంది. అంతేకాదు కొబ్బరికాయలు కొట్టడానికి బలం అవసరం. స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆనాటి కాలంలో భావించారు. అలా కొబ్బరికాయలను పురుషులు మాత్రమే కొట్టేవారు.
అయితే ఇప్పుడు రోజులు మారాయి. పురుషులతో సమానంగా మహిళలు ఉంటున్నారు. ఇప్పటికే చాలా ఆలయాలలో ఆడవాళ్లు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు. మహిళలు కొబ్బరికాయ పగలకొట్టకూడదని నియమం కానీ నిషేధం కానీ లేదు. ఆలయాలలో కొబ్బరికాయ కొట్టడాన్ని అనుమతించారు. ఒకప్పుడు స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు అనే ఆచారం ఉండేది కానీ ఇప్పుడు సమానత్వం అనే అంశం వలన పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని పనులను చేస్తున్నారు.