Aloevera : కలబంద అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే దీనివలన అన్ని ఉపయోగాలు ఉంటాయి. కలబందను ఎక్కువగా ముఖం అందంగా తయారుకావడానికి ఉపయోగిస్తారు. అలాగే జుట్టు నల్లగా, పొడవుగా పెరగడానికి కలబందను ఎక్కువగా ఉపయోగిస్తారు.అంతేకాకుండా, కలబందను వివిధ రకాల ఔషధాలలో ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే కలబందలో ఎ, బి, సి, డి,ఇ వంటి విటమిన్లు అధిక మోతాదులో దొరుకుతాయి. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో కలబందను దివ్యఔషధంగా పరిగణిస్తారు. కలబంద అందానికి, ఆరోగ్యానికి మొదటి స్థానంలో ఉంది.కలబందతో వివిధ అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. కలబంద వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబందలో లవణాలు, ఎలిమెంట్లు కావలసినంతగా దొరుకుతాయి. ఇది జీర్ణక్రియ వ్యవస్థ మంచిగా పనిచేసేలా చేస్తుంది. కలబందను రోజు కొద్దిగా తీసుకోవడం వలన మనం తిన్న ఆహారం మంచిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే రోజు కలబందను పరిగడుపున తీసుకోవడం వలన మన శరీరంలోని వ్యర్ధ, విష పదార్ధాలు బయటకు విసర్జించేలా చేస్తుంది. అలాగే కలబందలో ఉండే బ్రాడికినెస్ అనే ఎంజైమ్ కడుపులో మంట తగ్గడానికి సహాయపడుతుంది. ఈ కలబందను రోజు చర్మానికి రాసుకుంటే చర్మం సున్నితంగా, సుకుమారంగా తయారవుతుంది. అలాగే చర్మంపై ఉండే మచ్చలు, ముఖంపై ఉండే మొటిమలు ఈ కలబందతో సులువుగా తొలగిపోతాయి. ముఖానికి వివిధ రకాల ఆయింట్ మెంట్స్ ను వాడే బదులు నాచురల్ ప్రొడక్ట్ అయిన కలబందను వాడితే చాలా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ శరీరాన్ని కాపాడుకోండి.
Aloevera : కలబంద మన శరీరానికి ఒక దివ్య ఔషధం…
కలబందలో ఉండే లిపాసెస్ ఎంజైమ్ మన బాడీలోని చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే కలబందలో ఉండే సలిసైలిక్ యాసిడ్ మన శరీరంలోని రక్తంను పలుచగా ఉండేలా చేస్తుంది. ఈ సలిసైలిక్ యాసిడ్ వలన ఎటువంటి చర్మ సమస్యలు రావు. అలాగే కలబందలోని సపోనిన్స్ మన శరీరానికి యాంటి సెప్టిక్ గా పని చేస్తాయి. మన బాడీలోని వివిధ రకాల బ్యాక్టీరియాను, వైరస్ లను నాశనం చేయడానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రొటెనెస్ అనే మరో ఎంజైమ్ ప్రోటిన్లు సులువుగా జీర్ణం కావడానికి ఈ కలబంద బాగా సహాయపడుతుంది. ఇంకా ఈ కలబంద వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
వైద్యశాస్త్ర ప్రకారం మన శరీరానికి కావలసిన 22 యాసిడ్స్ లో 20 యాసిడ్స్ ఈ కలబందలోనే దొరుకుతాయట.దీనివలన గ్యాస్ ప్రోబ్లమ్స్, మలబద్ధకం సులభంగా తగ్గించుకోవచ్చు. కలబందలో 12 రకాల క్రిమినాసికాలు ఉంటాయి. ఇవి మన కడుపులో వచ్చే అల్సర్ ను, నొప్పిని తగ్గిస్తాయి. అలాగే లివర్ ప్రొబ్లమ్స్, డయాబెటీస్, రక్తహీనత, ఎముకల నొప్పులు వంటి సమస్యలకు సులువుగా పరిష్కారం చూపించుకోవచ్చు. అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి కలబందను ఎక్కువగా వాడుతారు. వారానికి రెండు సార్లు కలబందను గుజ్జులాగా చేసుకొని తలకు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గి నల్లగా నిగనిగలాడుతుంది. అలాగే చుండ్రు ఎక్కువగా ఉన్నవారు కలబందను తలకు పెట్టుకుంటే సులువుగా తగ్గుతుంది.