Rythu Bandhu : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ లో రైతు బంధు డబ్బుల కోసం తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తొలకరి జల్లులు కూడా కురిశాయి. దీంతో కొందరు రైతులు విత్తనాలు కూడా నాటుతున్నారు. వరి నారు కూడా వేశారు కొందరు రైతులు. ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం కొందరు రైతులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. గత సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్ కోసం జులైలో డబ్బులు జమ అయ్యాయి. మరి ఈ సీజన్ లో ఎప్పుడు డబ్బులు జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

ఈనేపథ్యంలో రైతు బంధు డబ్బులపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రైతు బంధు డబ్బులు అందరు రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. రైతులు ఎవరూ టెన్షన్ పడొద్దు.. ఎవరూ ఆందోళన చెందొద్దు అని ఆయన భరోసా ఇచ్చారు.
Rythu Bandhu : రాజకీయ కారణాల వల్లనే నిధులు ఇంకా రాలేదు
అయితే.. కొన్ని రాజకీయంగా చోటు చేసుకున్న కారణాల వల్ల ఇంకా నిధులు రాష్ట్రానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం కావాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేస్తుందని.. కావాలని తమను ఇబ్బంది పెడుతోందని.. అందుకే రాష్ట్రమే నిధులు సమకూర్చి.. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈసారి రైతులు ఎక్కువగా పత్తి పంట వేయండి. రైతులకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకొవచ్చు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే కాల్ సెంటర్ ప్రారంభించాం. రైతులు సూచనలు, సలహాలు కూడా ఇవ్వొచ్చు అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.