Managaku: మనలో చాలామందికి మునగాకు వంటల్లో వాడుకోవచ్చని విషయం కూడా తెలియదు. దీనిలో ఉండే కణజలవణాలు, విటమిన్లు శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి.కొద్దిపాటి మాంసం కృతులతోపాటు ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకొని తింటే కీళ్ల జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
మునగ కాడలను కురగా, సాంబారుగా పప్పుల్లో వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కీటకాలు కుడితే, మునగాకు కాడ నలిపి తీసిన రసాన్ని కట్టు కడతారు. యాంటీసెప్టిక్ కనుక గాయాలు, పుండ్లు,కాలిన మచ్చలు త్వరగా తగ్గుతాయి. ఉప్పు కలిపిన మునగాకు రసం కొద్దిగా సేవిస్తే అజీర్ణం తగ్గిపోతుంది. ఒక్క చెంచాడు మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ప్రతిరోజు పడుకునే ముందు తీసుకుంటే రేచీకటి తగ్గిపోతుంది. ఒక స్పూన్ మునగాకు రసంలో కొంచెం తేనె వేసి దీన్ని ఒక గ్లాస్ లేత కొబ్బరి నీళ్లలో కలిపి తాగితే కలరా ,విరోచనాలు తగ్గుతాయి.
Managaku : మునగాకు ఎలా తినాలి.. ఈ ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

మునగాకు రసాన్ని బాగా మరిగించి న తర్వాత చల్లార్చి మునగాకు రసం ఒక చెంచా, క్యారెట్ రసంలో కలిపి తాగితే మూత్ర విసర్జనలో మంట ,మలబద్ధకం ,ఇతర మూత్ర సంబంధిత వ్యాధులు అంతరిస్తాయి. గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యేంతవరకు మునగాకు రసం కాచి చల్లార్చి వడగట్టి పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే, పిండం చక్కగా ఎదగడం, సుఖప్రసవం కావడం జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి రోజు టానిక్ లాగా అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఈ ఆకును ఆరబెట్టి చూర్ణం చేసి కేవలం సువాసన కోసమే కొన్ని వంటల్లో వాడుతారు.