Kamal Hasan : కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూనివర్సల్ స్టార్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ విక్రమ్ ‘. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా యాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రేండ్ ని సెట్ చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
‘ విక్రమ్ ‘ సినిమా సక్సెస్ కావడంతో కమల్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ ఇండియన్ 2 ‘ సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ‘ విక్రమ్ ‘ ప్రమోషన్స్ లో భాగంగా ‘ ఇండియన్ 2 ‘ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమాలో ఓల్డ్ గెటప్ కోసం ఆమె మేకోవర్ కోసం కమల్ హాసన్ యూఎస్ వెళ్తున్నారంట. మూడు వారాలపాటు అక్కడే ఉండి సినిమాకు తగ్గట్టుగా ఫిజిక్ ని మార్చుకొని ఇండియాకి తిరిగి రానున్నారట. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
Kamal Hasan : కమలహాసన్ ‘ ఇండియన్ 2 ‘ సినిమా పట్టాలెక్కినట్టేనా…

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా హీరో రామ్ చరణ్ తో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘ ఇండియన్ 2 ‘ సినిమాను తెరపైకి తీసుకొస్తారు. అందుకోసం లైకా వర్గాలు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కరోనాకు ముందు సెట్ లో క్రేన్ విరిగిపడి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన నలుగురు సభ్యులు చనిపోవడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత లైక వర్గాలతో దర్శకుడు శంకరకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ మూవీ షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి కమల్ చర్చలు జరపడంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేయబోతున్నారు.