Cancer Causes : క్యాన్సర్ పేరు చెప్పగానే చాలామంది భయపడిపోతుంటారు. క్యాన్సర్ వస్తే మరణిస్తారు అని అపోహ పెట్టుకుంటారు. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మన రక్షించుకోవాలంటే ముందుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. డైట్ లో జంక్ ఫుడ్, ప్యాకేజీ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. బయట తినే ఆహార పదార్థాల వలనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే క్యాన్సర్ రావడానికి మరొక కారణం కూడా ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా డ్రింక్ చేయడం వలన కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్ద ప్రేగు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మందు మితంగా తాగితే ఏమి కాదు కానీ అతిగా తాగితే అనేక రకాల సమస్యలు వస్తాయి. అలాగే మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే కానీ ఫ్రెష్ గా ఉన్న మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ప్రస్తుతం రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. ప్రాసెస్ అంటే ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు. ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆయిల్ పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి.
క్యాన్సర్ తగ్గించడానికి అవకాడో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బ్లూటూత్ అనే శక్తివంతమైన పదార్థం క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. అందుకే దీనిని బ్లూటూత్ మాస్టర్ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. వాల్ నట్స్, అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు క్యాన్సర్ లను అడ్డుకుంటాయి. అవిసె గింజలతో పాటు తృణ ధాన్యాలతో పాటు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ ను నివారించవచ్చు. ప్రతిరోజు కప్పు నీళ్లల్లో పసుపుతో పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజు తాగితే ఫలితం ఉంటుంది. అయితే ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి, చికాకు, కోపం తగ్గించుకుంటే చాలా రకాల రోగాల బారి నుంచి బయటపడవచ్చు.