Bhagavanth Kesari – Trailer : సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య డైలాగ్స్ అంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో మాస్ డైలాగ్స్ , యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమానే భగవంత్ కేసరి. అయితే ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి మరింత మాస్ యాక్షన్స్ తో తీసినట్లు కనిపిస్తుంది. అంతేకాక బాలయ్యను సరికొత్త కోణంలో చూపించినట్లుగా అర్థమవుతుంది.
ఇక నిజ జీవితంలో బాలయ్య పాడే పాటలకు ఎంత ట్రోలింగ్ వచ్చిందో తెలిసే ఉంటుంది. ఇలా వచ్చిన ట్రోలింగ్ సైతం భగవంత్ కేసరి సినిమాలో సెటైర్లుగా చూపించారు. ఇక ఈ ట్రైలర్లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ అయిన వ్యాఖ్యలను తీసుకొని సినిమాలో చూపించారు. కెసిపిడి , పిల్ల మొగ్గ వంటి డైలాగ్స్ ని కూడా అనిల్ రావిపూడి సినిమాలు పెట్టేసాడు. ఇక ఈ డైలాగ్స్ తో ట్రైలర్ క్రేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ ని చూసినట్లయితే బిడ్డ కోసం తండ్రి పడే ఆరాటం…ఆర్మీలో ఎలాగైనా తన బిడ్డను చేర్చాలని తండ్రి కల ,దానిలో తన బిడ్డ ఎదుర్కొనే సమస్యను ట్రైలర్ లో చూపించారు.
అలాగే ట్రైలర్ చివర్లో బాలయ్య ఓ పాట పాడి ఎట్లా ఉందిరా అని అడగడం , బాగుందని విలన్ మొహమాటంగా చెప్పడం. ఎట్లున్న పాడుతా ఐ డోంట్ కేర్ అంటూ ట్రైలర్ ని ముగించారు. అయితే భగవాన్ కేసరి సినిమా అక్టోబర్ 19 దసరా కానుకగా రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ వరంగల్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ట్రైలర్ బాలయ్య ముందు సినిమాల లాగే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కించేలా ఉంది. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయం అని అర్థమవుతుంది. కామెడీ యాక్షన్ సీన్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ తో అన్ని కోణాలలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది.