Health Benefits : మనం సంతోషంగా ఉంటేనే ఇతరులతో మాట్లాడగలం. మన మూడ్ సరిగా లేనప్పుడు ఇతర వ్యక్తులు పలకరించిన చిరాకుగా అనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఎవరితో మాట్లాడాలని అనిపించదు. ఏ పని చేయాలని అనిపించదు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ను తింటే మాత్రం మూడ్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఇవి మిమ్మల్ని హుషారుగా కూడా చేస్తాయి. కొంతమంది మూడ్ సరిగా లేదని బిస్కెట్లను తింటుంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఇవి మూడ్ మార్చలేవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహార పలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎప్పుడైనా డల్ గా మారితే… వెంటనే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. అవేంటంటే
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి-6, ఖనిజాలు, చక్కెర దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తాయి. ఈ పండ్లు మీకు వెంటనే రిలీఫ్ నిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్ గా తినాలి ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఓట్స్ డయాబెటిస్ వంటి సమస్యలకు దూరం చేస్తుంది. అందుకే ఇవి రక్తంలోనే చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. ఓట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తక్షణమే ఎనర్జీ ని అందిస్తుంది. అలాగే హ్యాపీ మూడిలోకి మారిపోతారు. అందుకే ఉదయం లేచిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ ల వీటిని తీసుకోవాలి. దీంతో రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
Health Benefits : ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. తక్షణమే రిలీఫ్ అవుతారు.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల మూడ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినడం వల్ల ఇది మిమ్మల్నే రిఫ్రెష్ గా చేస్తుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు డోపమైన్ ను పెంచేందుకు ఉపయోగపడతాయి. దీంతో మీరు మరింత హ్యాపీ మూడ్ లో వెళ్ళిపోతారు. కాయ ధాన్యాలలో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. జింక్ ,ఫైబర్ ,విటమిన్లు, పొటాషియం ,మెగ్నీషియం ఇలా వివిధ రకాల ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
నట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తింటే శరీరంలో ఉండే విటమిన్ లోపం పోతుంది. బరువు కూడా తగ్గుతారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మూడ్ బాగా లేనప్పుడు వీటిని నెమలి తినడం వల్ల హ్యాపీ మూడ్ కి మారుతారు. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి