Health tips : మునగాకు ముఖ్యంగా మన కంటి చూపుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 గ్రాముల మునగాకు తీసుకుంటే అందులో 6750 మైక్రో గ్రాముల బీటా కెరొటిన్ ఉంటుంది. మన శరీరానికి కేవలం 2400 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్ సరిపోతుంది, మిగిలిన 4350 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది అందువలన కంటిచూపుకి కావలసిన విటమిన్ ఎ మునగాకు నుంచి లభిస్తుంది. అదే విధంగా 100 గ్రాముల మునగాకు లో 440 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.
మునగాకు, మునగాకు పొడి ని తీసుకోవడం వలన పాలు త్రాగడం అవసరం లేకుండానే మూడు రేట్లు అవసరమైన క్యాల్షియం దొరుకుతుంది. దీని వలన ఎముకలు వీరుగకుండా దృఢంగా ఉంటాయి. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్త తయారీకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది, రక్తహీనత రాకుండా దోహదపడుతుంది. 2009 సంవత్సరంలో చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో జరిగిన పరిశోధనల ప్రకారం, రోజుకు 50 గ్రాముల మునగాకు తీసుకోవడం వలన డయాబెటిస్ బాగా తగ్గుతుందని, కంట్రోల్ కి వస్తుందని, 21% ఎఫెక్ట్ అలా ఉందని నిరూపించారు.
Health tips : మునగాకు మనం హెల్దీగా ఉండడంలో దోహదపడుతుంది.

ఇతర ఆకులతో పోలిస్తే మునగాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ప్రేగుల్లో ఆహార పదార్థాలు త్వరగా జరిగి, మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. అలాగే 50 గ్రాముల మునగాకు లో ప్రత్యేకంగా 108 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది, విటమిన్ సి యాంటీ యాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. మునగాకులో ఉండే ఫైటో కెమికల్స్ మరియు పాలీ ఫినాల్స్ అనే రెండు కెమికల్స్ రక్తం లోనే ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. 2018 సంవత్సరంలో టైఫ్ యూనివర్శిటీ సౌదీ అరేబియా వాళ్లు చేసిన పరిశోధన ప్రకారం మునగాకు హెచ్ డి ఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ నీ పెంచడానికి ఎల్ డి ఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిర్ధారించారు.
దీని వలన గుండె జబ్బులు రాకుండా నివారించి, బ్లడ్ హెల్దీగా ఉండడంలో దోహదపడుతుంది. ఈ మునగాకును పొడిచేసుకుని కూరలలో వేసుకోవడం, పప్పుల్లో వేసుకోవడం, ఫ్రై చేసుకోవడం, ఆకుకూరలతో ఎలా వంట చేసుకుంటామో అలానే మునగాకు కూడా వండుకోవచ్చు, అనేక విధాలుగా మునగాకును తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండి ,ఎన్నో లాభాలను పొందవచ్చు .అంతే కాకుండా గాయాలు అయిన చోట మునగాకును దంచి, ఆముదం కలిపి వాడటం వలన మంచి రిజల్ట్ ఉంటుంది.దగ్గు నుంచి ఉపశమనం పొందడం కోసం మునగాకును దంచి, రసం సేకరించి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. బరువు తగ్గడంలో కూడా మునగాకు ఉపయోగపడుతుంది. మునగాకు జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది, చర్మంపై నల్లమచ్చలు, మొటిమలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.ఇన్ని లాభాలు ఉన్నా మునగాకును మీరు తప్పకుండా వాడండి.