Health : ఆయిల్ లేకుండా ఇంట్లో వంటలు చేయలేం.. ఇక డీప్ ఫ్రై కి అంటే పూరి, బజ్జీలు, బోండాలు చేసుకున్నప్పుడు ఈ నూనె మిగిలిపోవడం సహజమే. అయితే మిగిలిపోయిన ఈ ఆయిల్ ను పదేపదే వాడడం కూడా సర్వసాధారణమే. అయితే ఒకసారి వాడిన నూనెను ఇలా మళ్లీ మళ్లీ వాడడం వల్ల ఏం నష్టం లేదా.? దీనివలన ఏమైనా అనర్ధాలు కలుగుతాయా.? అయితే తప్పకుండా కలుగుతాయని తెలియజేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా బయట ఫుడ్ వండే వాళ్లు ఆయిల్ ను పదేపదే వినియోగిస్తూ ఉంటారు. ఒకసారి కాగి చల్లారిన ఆయిల్ ని తిరిగి వినియోగిస్తుంటారు. ఈ విధంగా అధికమార్లు వినియోగించిన ఆయిల్ ని తిరిగి వాడడం ద్వారా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం కలుగుతుందని తెలుసా మీకు.? ఒక మారు వాడిన ఆయిల్ ని తిరిగి మళ్లీ వినియోగిస్తే కలిగే అనర్ధాలు ఇవే.
ఆయిల్ మళ్లీ వినియోగించడం ద్వారా శరీరంలో మంచి కొళాస్ట్రాలు తగ్గిపోతుంది. దీనికి కారణం గుండె జబ్బులు, బిపి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లడ్ సర్కులేషన్ వేగం తగ్గిపోతుంది. ఇటువంటి ఆయిల్ తో చేసిన వంటకాలను తీసుకోవడం గుండెకి ప్రమాదం కలిగించే ఆల్జీమర్స్, పార్కిన్సాన్స్, సో క్యాన్సర్ కాలేయ ఇబ్బందులుతో ఎదుర్కోవలసి ఉంటుంది. అల్టిహైడ్స్ అనే విష పదార్థం మూలంగా ఈ ప్రమాదాలు కలుగుతాయి. మళ్లీ మళ్లీ వినియోగించిన నూనెను వాడడం ద్వారా వచ్చి ఫ్రీరాడికల్స్ మూలంగా క్యాన్సర్ ధమనులు బ్లాక్, ఎతోరెస్క్లూసిస్ లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.సహజంగా స్ట్రీట్ ఫుడ్ తినే టైంలో టేస్టీగా ఉన్న తిన్న తదుపరి గ్యాస్ ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. దీనికి కూడా ఈ విధంగా వాడిన ఆయిలే మూలం.

Health : ఈ టిప్స్ ను పాటించండి :
ఒకసారి వినియోగించి మిగిలిన ఆయిల్ ను వృధా చేయలేం. మరి అటువంటిప్పుడు ఆయిల్ ని ఏం చేయాలి. సరియైన రీతిలో తిరిగి వినియోగించుకునే అవకాశం లేదా.? అంటే కొన్ని టిప్స్ ద్వారా చేయవచ్చు. అవి ఇవే..
*ఒకసారి వినియోగించిన నన్ను ఇంకొకసారి వినియోగించే ముందు ఒకసారి నూనె స్థితి ఏ విధంగా ఉందో చెక్ చేసుకోండి. నూనె రంగు ముదురు కలర్ లోకి మారిన జిడ్డుగా అయిపోయిన ఉపయోగించడం మంచిది కాదు.
*వంట చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ను చల్లార్చిన తదుపరి గాలి చొరబడని వాటిలలో స్టోర్ చేసుకోవాలి. ఇలా అవసరం ఉన్నప్పుడు వినియోగించుకుంటే కొంతలో కొంత ప్రమాదకరమైన ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
*వీలైనంత వరకు సరిపడా ఆయిల్ తోనే ఏ వంటకమైనా చేసుకోవాలి. కొంచెం మిగిలిన వంటకి ఉపయోగించడం కంటే ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులకు వాడుకుంటూ ఉండాలి.