Viral Video : మనిషి పుట్టుక ఎప్పుడో తెలియదు.. మరణం ఎప్పుడో తెలియదు. మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అదే జీవితం అంటే. రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో కూడా చెప్పలేం. నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో ఊహించలేని జీవితం ఇది. ఇంకా మన లైఫ్ స్టయిల్, మనం తినే ఫుడ్.. లాంటివి మన జీవితాన్ని ఇంకా త్వరగా ముగించేస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు, లేనిపోని ఆరోగ్య సమస్యలు, గుండె సమస్యలు.. యాక్సిడెంట్స్ ఇలా జనాలు ఎలా ఎప్పుడు చనిపోతున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ వీడియోను చూస్తే అసలు మరణం ఇంతలా క్షణాల్లో వచ్చేస్తుందా అని నోరెళ్లెబడతారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురి అనే ప్రాంతంలో కొత్వాలిలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే… రవి వర్మ అనే వ్యక్తి కొత్వాలిలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపానికి వెళ్లాడు.
Viral Video : డ్యాన్స్ తో అందరినీ అలరించిన రవి వర్మ
గణేశ్ మండపంలో సెలబ్రేషన్స్ జరుగుతుండటంతో అక్కడికి వచ్చిన భక్తులను అలరించేందుకు రవి వర్మ హనుమాన్ వేషం వేశాడు. భక్తులను అలరించాడు. చాలా సేపు హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఏం జరిగిందో అని అందరూ టెన్షన్ పడ్డాడు. అతడి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందాడు. రవి వర్మ వయసు 35 ఏళ్లే. కానీ.. ఆ వయసులోనే గుండెపోటుతో మరణించాడు. అంత చలాకీగా ఉండే వ్యక్తి… అంత తక్కువ వయసులో గుండెపోటుతో మరణించడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కసారిగా విగతజీవిగా మారిపోవడాన్ని అక్కడున్న వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అంత సేపు హుషారుగా ఉండి అలా ఒక్కసారిగా చనిపోవడం ఏంటి అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Mainpuri: रामभजन पर नृत्य करते हनुमान स्वरूप बने युवक की मौत, सामने आया आखिरी पलों का वीडियो@JagranNews @JagranNewMedia pic.twitter.com/5EqVX7n6yT
— Abhishek Saxena (@abhis303) September 3, 2022