Health : ప్రస్తుతం చాలా ఉంది బాడీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాడీ ఫిట్ గా ఉండాలని మరికొందరు పరిగెత్తుతుంటారు. అయితే ఎక్కువగా పరిగెత్తడం అంత మంచిది కాదట. ఎక్కువ దూరం పరుగు కారణంగా పురుషులకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఈ మధ్యనే ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో రన్నింగ్ పురుషులకంటే మహిళలకు ఎక్కువ లాభంగా ఉంటుందని తేలింది. ఎక్కువ దూరం పరిగెత్తే మగవారిలో వారి ప్రధాన దమనులు ఊహించిన దానికంటే చాలా గట్టిగా మారుతున్నట్లు కనుగొన్నారు. తద్వారా వారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలింది. అధ్యయనం ప్రకారం ఐరన్ మ్యాన్, మారతాన్స్, ట్రయాథ్లాన్స్, సైక్లింగ్ ఈవెంట్ లలో క్రమం తప్పకుండా పాల్గొనే మగవారి వయసుకుంటే వారి ధమనుల వయసు 10 సంవత్సరాలు పెద్దగా ఉంటుంది.
మారథాన్ ల వంటి ఈవెంట్లు మహిళల ఆరోగ్యాన్ని పెంచుతాయని అధ్యయనంలో తేలింది. రన్నింగ్ మహిళల్లో రక్తనాళాల వయసుని సగటున ఆరు సంవత్సరాలు తగ్గించింది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న రన్నర్ లో పరిశీలన ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేశారు. 300 కంటే ఎక్కువ మంది ఈ అధ్యాయంలో పాల్గొన్నారు. అంతేకాకుండా కనీసం 10 సంవత్సరాలు ప్రతిరోజు వ్యాయామం చేశారు. స్త్రీలు పరిగెత్త వద్దని తరచుగా సలహా ఇస్తుంటారు. కుంగిపోయిన దవడల ముడతలు, మచ్చలు ఏర్పడతాయని మహిళలు పరిగెత్తడానికి భయపడతారు.
అయితే ఈ అధ్యయనం ద్వారా అవన్నీ నిజం కాదని తేలింది. పరిగెత్తడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అలా చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. సరైన బట్టలను ధరించాలి. మంచి రన్నింగ్ షూస్ కూడా ఉండాలి. పరుగులో వేగాన్ని ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు నెమ్మదిగా చేయాలో తెలుసుకోవాలి.. పరుగును వెంటనే ఆపకూడదు. ఆగిపోయే వరకు వేగాన్ని నిదానంగా తగ్గించుకుంటూ రావాలి. కాళ్లు కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు రన్నింగ్ ఆపాలి. దీనికి బదులుగా సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామాలను చేయడం మంచిది. ఎక్కువగా పరిగెత్తడం వలన శరీరానికి హాని కలుగుతుంది. ఇలా చేయడం వలన అరికాలు పాసిటీస్ గా మారవచ్చు. అంతేకాకుండా ఎక్కువ వ్యాయామం కూడా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది.