Guppedanta Manasu : జగతి తో గుండె భారంగా ఉంది అని చెప్తున్నా మహేంద్ర… రిషికి ధైర్యం చెబుతున్న వసుధార…

Guppedanta Manasu : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానులన్నీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. ఈరోజు ఎపిసోడ్ 589 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మహేంద్ర జగతి రిషి సంతోషం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొకపక్క రిషి వసుధారలు సరదాగా గడిపి ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చి వసుధారని రిషి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రిషి మహేంద్ర కోసం రూమ్ లోకి వెళ్లి అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ కనిపించపోయేసరికి అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్ లో వెళ్తున్నాం అని రాసిన దాన్ని చూసి టెన్షన్ పడుతూ దేవయాని దగ్గరికి వెళ్లి డాడ్ వాళ్లు ఎక్కడికి వెళ్లారు పెద్దమ్మ.. వాళ్ళు వెళుతుంటే మీరు ఆపలేదా కనీసం నాకైనా చెప్పాలి కదా అని గట్టిగా తనని అడుగుతూ ఉంటాడు.

Advertisement
guppedanta manasu tomorrow twist v
guppedanta manasu tomorrow twist

కానీ దేవయాని నేను ఆపాను నాన్న కానీ వాళ్లు నా మాట వినలేదు.. మా ఇష్టం అని వెళ్ళిపోయారు అని రిషి పై ప్రేమ వలకబోస్తూ డ్రామాలాడుతూ ఉంటుంది. అంతలో గౌతమ్ అక్కడికి రాగా… దేవయాని జరిగిందంతా గౌతం కి చెప్తుంది. అప్పుడు గౌతమ్ రిషి ని ఓదార్చి నేను వెళ్తున్న వాళ్ళని వెతకడానికి ను కంగారు పడకు అని వెళ్లి వసుధారకి జరిగినంత చెప్పి రిషి ని ఓదార్చు తన టెన్షన్ పడకుండా చూసుకో పో వాడు చాలా సెన్సిటివ్ అని తనని పంపిస్తాడు. అప్పుడు వసుధార ఇంటికి వచ్చి రిషి ని పిలుస్తూ ఉండగా.. రిషి వచ్చి వసుధర డాడ్ వాళ్లు ఎక్కడికి వెళ్లారు నీకేమైనా కనిపించారా అని అంటుండగా.. వసుధరా మీరు టెన్షన్ పడకండి సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్లరు.. మిమ్మల్ని వదిలేసి మీరంటే చాలా ప్రేమ మీరు రిలాక్స్ అవుదురు గాని రండి అని వెళ్తూ ఉండగా.. దేవయాని ఎక్కడికి అని అడుగుతుంది.

Advertisement

అప్పుడు రిలాక్స్ అవుతాడు. సార్ మీరు స్ట్రాంగ్ గా టీ పెట్టి తీసుకురండి అని చెప్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని షాక్ అవుతూ ఉంటుంది. ఇది నాకే పని చెప్తుంది ఏంటి అని అనుకుంటూ దీనికి రోజు రోజుకి ఎక్కువవుతుంది అనుకుంటూ వసుధారని తిట్టుకుంటూ ధరణిని కూడా పిలిచి టీ పెట్టుకుని తీసుకురా రిషి కోసం అని చెప్తుంది. అప్పుడు ధరణి టి పెట్టి తీసుకొని రిషి దగ్గరికి వెళుతూ ఉండగా.. నాకు ఇవ్వు నేను తీసుకెళ్తాను అని చెప్పి రిషి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం సార్ రిలాక్స్ అవుతారు.. మనం మళ్లీ పదే పదే దాని గురించి మాట్లాడుతుంటే తను ఇంకా టెన్షన్ పడతాడు అని దేవయాని ని అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడు దేవయాని షాక్ అవుతుంది. నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది.

ఇది ఎందుకు వచ్చింది రిషి ని నాకు దగ్గర చేసుకోవాలనుకున్నాను అని కుళ్ళుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గౌతం అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ వాళ్ళు కనిపించరు.ఇక మహేంద్ర జగతి ఒక దగ్గర ఉంటారు. మహేంద్ర తెగ బాధపడుతూ ఉంటాడు. రిషి కోసం అప్పుడు తనకి సడన్గా గుండెల్లో బరువుగా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని జగతితో చెప్తూ ఉంటాడు. జగతి మాత్రం మీరు అతిగా టెన్షన్ పడుతున్నారు. మనం రిషి సంతోషం కోసమే బయటకు వచ్చాం.. అది తట్టుకోని నిలబడాలి అని తనకి ధైర్యం చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే గౌతమ్ కి రిషి ఫోన్ చేసి అడుగుతాడు. అప్పుడు గౌతమ్ నాకు ఇంకా కనిపించలేదు.. నువ్వు టెన్షన్ పడకు నేను వాళ్ళని తీసుకుని వస్తాను అని చెప్తాడు. అప్పుడు రిషి వసుధారాన్ని ఇలా అడుగుతూ ఉంటాడు. నేనేమైనా పొరపాటు చేశాన వసుధరా ఎందుకు డాడీ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. తన లేకుండా నేను ఎలా ఉండాలి. నేను లేకుండా తను ఎలా ఉంటాడు అని అంటూ ఉండగా.. అప్పుడు వసుధార వాళ్లు ఎందుకు వెళ్లారు దేవయాని మేడం ఏదో అని ఉంటుంది. వాళ్ళ మనసుకి బాధ కలిగేలా మాట్లాడి ఉంటుంది అని చెప్తూ ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement