Health Care : ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల ఆకులతో చాలా వ్యాధులను నయం చేసుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మారేడు చెట్టుతో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అని వైద్యశాస్త్రం చెబుతుంది. ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో మారేడు ఆకు ముందు వరుసలో ఉంటుంది. మారేడు చెట్టు శివుడికి ఎంతో ప్రీతికరమైనది. హిందువులు మారేడును పూజిస్తారు. మారేడు చెట్టు ఆకులలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ విటమిన్ బి , సి పుష్కలంగా ఉంటాయి. మారేడు ఆకులు షుగర్ నివారణకు చాలా మంచిది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకు కషాయం త్రాగడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.
మారేడు ఆకులు చర్మవ్యాధులను తగ్గించడంలో క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మారేడు ఆకుల రసం తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల రసంలో కొంచెం తేనె కలిపి త్రాగడం వలన జ్వరం తగ్గుతుంది. మారేడు ఆకుల రసంలో అల్లం రసం కలిపి త్రాగటం వలన రక్తసంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇక ఈ మారేడు ఆకులను వేరును, బెరడును కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని గాయాల పై ఉంచితే ఎప్పటినుంచో మానకుండా లేదా తరచుగా శరీరంపై గాయాలు వస్తూ ఉంటే ఈ గుజ్జును గాయాలపై వేస్తే త్వరగా మానిపోతాయి. అంతే కాకుండా ఈ చెట్టు ఆకులకు ఊబకాయాన్ని తగ్గించే శక్తి కూడా ఉందని పరిశోధనలో తేలింది.
అందుకే అధిక బరువుతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ మారేడు ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీగా బరువు తగ్గిపోతారు. అధిక బరువు ఉన్నవారు మారేడు ఆకుల రసం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఈ ఆకులను ఉపయోగించి తొంభైశాతం రోగాలను తగ్గించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకుతో చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పరిముఖ్యంగా అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని నిరోధించడంలో మారేడు ఆకులు ముఖ్యపాత్ర పోషిస్తాయి అనే పరిశోధనల తేలింది.