Viral Video : ఇజ్రాయెల్ పోలీసుల సాహసలు…ఉగ్రవాదులను మట్టు పెట్టిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Viral Video  : ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల మధ్య గత నాలుగు రోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు ఊహించని విధంగా మెరుపు దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ హామాస్ దాడులను తిప్పికొట్టే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే వారి స్థావరాలపై వైమానిక దాడులకు దిగుతోంది. ఇక ఈ దాడులలో పలువురు చనిపోవడంతో పాటు పెద్ద పెద్ద భవనాలు కూడా నేలమట్టమవుతున్నాయి. ఇక ఈ ఘటనాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఖాజాగా ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

చట్టానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ సరిహద్దులలో చొరబడిన హామాష్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు వెంబడించి మరి మట్టు బెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలకు వెళ్తే.. ఇజ్రాయెల్ సరిహద్దులలోకి హామాస్ మిలిటెంట్లు చట్ట విరుద్ధంగా కారులో వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు అప్రమత్తమై వారిని వెంటనే మట్టుపెట్టారు. ఇక వీరి నుండి తప్పించుకునే ప్రయత్నంలో హామస్ మిలింటెంట్లు కారు ను అత్యంత వేగంగా నడపసాగారు. ఇక ఇజ్రాయెల్ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టకుండా బైక్ పై వెంబడించారు. అలా వెళుతూ వెళుతూనే ఒంటి చేతితో ఓ పోలీసు అధికారి తుపాకీతో కాల్పులు కూడా జరిపాడు.

Advertisement

దీంతో కారులోని హామాస్ లు తీవ్రంగా గాయపడ్డారని అర్థమవుతుంది. దీంతో వారు వెంటనే కారును రోడ్డుు పక్కకి ఆపాల్సి వచ్చింది. ఇంతలోనే మరికొందరు ఇజ్రాయెల్ పోలీసులు అక్కడికి చేరుకొని అందరూ కలిసి ఏకదాటిగా హామాస్ లు ఉన్న కారు లో కాల్పులు జరిపారు. ఈ క్రమం లో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ వీడియో ఓ పోలీసు అధికారి హెల్మెట్ లో ఉన్న కెమెరా నుండి రికార్డు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ పోలీసులు చేసిన సాహసానికి అందరూ ఎంతగానో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement