Virus : కేరళలో నిఫా వైరస్ మరణాలు పెరుగుతున్నాయని దేశం ఆందోళన చెందుతున్న సమయంలో డెన్ 2 అనే డెంగ్యూ వేరియంట్ ను మరియు నోయిడాలో స్క్రబ్ డైఫస్ అనే కొత్త రకం జ్వరం కేసులను ఒడిస్సా మరియు హిమాచల్ ప్రదేశ్ లలో గుర్తించారు. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం ముగుస్తున్న ఈ తరుణంలో డెన్ 2 డెంగ్యూ మరోయి స్క్రబ్ టైపస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఎడీస్ ఈజిప్టీ అనే దోమకాటు కారణంగా వ్యాపించే డెన్ 2 బారిన పాడిన వారిలో బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, అలాగే శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడుతున్నట్లుగా నోయిడాలో గుర్తించారు.అయితే ఇప్పటికి ఓడిస్తాలో ఐదుగురు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో 9 మంది మరణించారు.
ఓరియంట్ స్క్రబ్ గమిస్సి బ్యాక్టీరియ ఎక్కువగా గడ్డి పొదల్లో, ఎలుకలు, కుందేలు ,ఉడతల చర్మం పై పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే డెన్ 2 ( డెంగ్యూ) బారిన పడిన రోగులలో తలనొప్పి , కండరాలనొప్పి , వాంతులు, వికారం, కీళ్ల నొప్పులు, కంటి వెనుక మంట , దురద లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇక స్క్రబ్ టైపస్ బారిన పడిన వాళ్ళు తీవ్ర జ్వరం, చలి , విపరీతమైన తలనొప్పి ,దగ్గు, జలుబు , ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు శరీరంపై దురద, ఎర్రటి మచ్చలు , వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా కేరళలో నిఫా వైరస్ వలన ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా తాజాగా 35 ఏళ్ల మరో వ్యక్తి ఈ వైరస్ బారిన పడి కన్నుమూశాడు. దీంతో నిఫ్ఫా వైరస్ మరణాల సంఖ్య 6 కు చేరిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేరళలోని కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని హెచ్చరించారు. అయితే ఈ నిఫ్ఫా వైరస్ కు సరైన వైద్యం లేకపోవడం గమనార్హం.