viral video : పెళ్లంటే నూరేళ్ల పంట కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అది నూరేళ్ళ మంటలా మారుతుంది. ఇక అవేమీ తెలియని చాలామంది బకరా బాబులు తొందరపడి పెళ్లి చేసుకుంటారు. సుఖం కోసం కక్కుర్తి పడి జీవితాంతం నరకం అనుభవిస్తూ ఉంటారు. అయితే చాలామంది పెళ్లిళ్లలో చేసే అల్లర్లు కలకాలం గుర్తుండిపోవాలని పెళ్లిలో పిల్ల చేష్టలు చేస్తుంటారు. అయితే అది అందరికీ సరదాగా అనిపించిన కొన్ని కొన్ని సార్లు చిరాకు తెప్పించే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెళ్లి మండపంలో అందరి ముందే వరుడు చేసిన కక్కుర్తి పని వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
ఇక వధువు రియాక్షన్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లికూతురు వరుడుకి అందరి ముందే తగిన గుణపాఠం నేర్పింది. వరుడు పెళ్లిలో కూడా తన చెడు అలవాటును మానుకోలేదు. పెళ్లి మండపానికి గుట్కా తింటూ వచ్చాడు. దీంతో ఆగ్రహించిన వధువు అందరి ముందు వరుడు చెంప చెల్లు మనిపించింది. అయితే పెళ్లి మండపంలో పూజారి పెళ్ళికొడుకును ఏదో తీర్థం తాగాలని కోరుతాడు. కానీ పెళ్ళికొడుకు నోట్లో గుట్కా వేసుకోవడంతో తాగడు. దీంతో పూజారి సర్దుకుపోయాడు. కానీ వధువు మాత్రం ఈ విషయాన్ని వదలలేదు.
పూజ ఇలాగేనా చేయించేది అని పూజారి వీపుపై ఒకటి పీకింది.అలాగే పెళ్లిలో గుట్కా వేసుకుంటావా తీర్థం తాగావా అని పెళ్ళికొడుకు చెంప చెల్లుమనిపించింది. దీంతో ఆ గుట్కాను ఉమ్మేయడానికి వరుడు వెనక్కి వెళ్ళగా అక్కడ మహిళలు ఉంటారు. చేసేదేమీ లేక అతి కష్టం మీద దానిని ఉమ్మేసి కూర్చుంటాడు. అయితే పెళ్లికూతురు పెళ్లి కాకముందే అందరి ముందు వరుడు ని కొట్టి భయపెడుతుంటే పెళ్లి అయిన తర్వాత వరుడి పరిస్థితి ఏంటో అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram