Eyesight : కళ్లద్దాలను శాశ్వతంగా తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు .. మన పూర్వీకులు ఇలానే చేసేవారు..

Eyesight  : ప్రస్తుతం మారిన కాలంగా చిన్నపిల్లలు కూడా కళ్లద్దాలను ధరిస్తున్నారు.ఎక్కువసేపు టీవీలు, మొబైల్స్ చూడడం ద్వారా కంటి చూపు మందగిస్తుంది. పెద్దవారు కూడా కళ్ళద్దాలు ధరిస్తున్నారు. ఒక్కసారి కళ్లద్దాలు ధరిస్తే వాటిని జీవితకాలం వినియోగిస్తూ ఉంటారు. అయితే కళ్లద్దాలను శాశ్వతంగా వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అనుసరిస్తే కళ్లద్దాలను శాశ్వతంగా వదిలించుకోవచ్చని వైద్యశాస్త్రం చెబుతుంది. ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని ఆచరించవచ్చు కానీ ఈ చిట్కాలు ప్రతిరోజు అనుసరించాలి. కనీసం 20 రోజులు తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే జీవితాంతం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు.

Advertisement

Red Light Therapy for Improving Eyesight at Home – Red Light Therapy Home

Advertisement

అయితే వీటిని చేసే ముందు అద్దాలు లేదా లెన్స్ లను తీసివేయాలి. మొదటిగా కళ్ళను పదిసార్లు పైకి, క్రిందికి కదిలించాలి. వీలైనంతవరకూ కళ్ళను బాగా పైకి కదిలించాలి. అలాగే వీలైనంతవరకు బాగా క్రిందికి వెళ్ళనివ్వాలి. ఆ తర్వాత కళ్ళను డయాగ్నల్ గా తిప్పాలి. వ్యతిరేక సవ్య దిశలో తిప్పుతూ ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే దృష్టి సరి అవుతుంది. అలాగే ముక్కు దగ్గర కళ్ల మధ్య బొటనవేలును ఉంచాలి. నెమ్మదిగా దృష్టిని కోల్పోకుండా చేతిని చాచి బొటనవేలును దూరంగా తరలించాలి. ఆ సమయంలో దృష్టిని బొటనవేలు కొనపై మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత బొటనవేలును ముక్కు వైపుకు తీసుకురావాలి. ఈ విధంగా పదిసార్లు చేస్తే కళ్ళ దృష్టి సరిగా అయి శాశ్వతంగా కళ్లద్దాలను దూరం చేసుకోవచ్చు.

కీర దోసకాయలు రెండు ముక్కలుగా తీసుకొని వాటిని కళ్ళ మీద 15 నిమిషాల పాటు ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత తగ్గిపోతుంది మరియు కళ్ళ చుట్టూ ప్రక్కల మొత్తం వెచ్చగా ఉంటుంది. ఈ కీర దోసకాయ కళ్ళను క్లీర్ చేయడమే కాకుండా బాడీని చాలా రిలాక్స్డ్ గా చేస్తుంది. ప్రస్తుతం చాలామంది లాప్టాప్, కంప్యూటర్ లను ఎక్కువసేపు చూస్తూ ఉంటున్నారు. అయితే ప్రతి అరగంటకు విరామం తీసుకుని 20 సెకండ్ల పాటు కళ్ళని మూసి తెరవాలి. ఇలా చేయటం వలన కళ్ళకు కొంచెం రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఇక చివర్లో ఈ చిట్కా ను మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. ఒక గదిలో కొవ్వొత్తి లేదా దీపం వెలిగించాలి. వీలైనంతవరకు రెప్పవేయకుండా కొవ్వొత్తి ని చూడాలి. అప్పుడు కళ్ళలో నీళ్ళు రావడం మొదలవుతుంది. దీనివలన కళ్ళు శుభ్రం అవుతాయి. ఈ చిట్కాలను కనుక రోజు అనుసరిస్తే 20 రోజుల తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. శాశ్వతంగా కళ్లద్దాలను దూరం చేసుకోగలుగుతారు.

 

Advertisement