World Cup 2023 : సొంత గడ్డపై సత్తా చాటిన భారత్…4.

World Cup 2023  : ఇది కదా అసలైన మ్యాచ్ అంటే. మన గడ్డపై మన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను మట్టి కరిపిస్తే వచ్చే మజానే వేరు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ప్రపంచ కప్ లో భాగంగా మరోసారి టీమిండియా తన సత్తా చాటింది. ఇక ప్రపంచ కప్ లో భాగంగా ఇప్పటికీ పాకిస్తాన్ – భారత్ మధ్య 7 మ్యాచ్ లు జరగగా ఇటీవల జరిగిన 8వ మ్యాచ్ లలో కూడా టీమిండియా ఘన విజయం సాధించి 8-0 సిరీస్ ని కొనసాగించింది. ఇటీవల జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ 30 ఓవర్లలోనే ముగించి సొంత గడ్డపై విజయభేరిని మోగించింది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ కి చుక్కలు చూపించారు.

Advertisement

అక్టోబర్ 14 నాటికి వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టిక

Advertisement

 

ఈ క్రమంలోనే భారత సారథి రోహిత్ శర్మ విజృంబించి ఆడాడు. 86 పరుగుల భారీ స్కోర్ చేసి పెవిలియన్ కు చేరాడు. కేవలం 63 బంతుల్లోనే 86 పరుగులు (6 సిక్స్ లు 6 ఫోర్స్) చేసి భారత్ స్కోర్ ని అమాంతం పెంచేశాడు రోహిత్ శర్మ. ఇక డెంగ్యూ కారణంగా కొన్నాళ్లపాటు మ్యాచ్ కు దూరమైన శుబ్ మాన్ గిల్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక పాకిస్తాన్ కు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీ కూడా ఈసారి 16 పరుగు లకే అవుట్ అవ్వడం గమనార్హం. దీంతో భారత ప్రేక్షకులు కాస్త నిరాశ చెందినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా విజయం సాధించింది.

India-Pakistan tie among World Cup matches set to be rescheduled | Reuters

30.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి గాను 192 పరుగులు చేసి మరో 117 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక రోహిత్ శర్మ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆప్ సెంచరీ చేసి భారత్ విజయానికి కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 53 పరుగులు చేయగా , కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ బౌల్లెర్స్ ఆఫ్రిది 2 వికెట్లు తీయగా , అజాం అలీ ఒక వికెట్ తో సరి పెట్టుకున్నాడు. ఇక ఈ గెలుపుతో భారత్ ఇప్పటివరకు వరల్డ్ కప్ లో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్స్ తో టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ లో టాప్ లో నిలిచింది. ఇక అక్టోబర్ 19న బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది.

 

Advertisement