Health Tips : ఉబ్బకాయ సమస్యతో చాలామంది సతమతమవుతున్నారు. బరువు పెరగడం వల్ల వివిధ రకాల జబ్బులకు గురికావాల్సి వస్తుంది. అందుకే బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. బరువు తగ్గటానికి చాలామంది జిమ్ లు చేస్తూ డైట్ ను ఫాలో అవుతున్నారు. కొందరు ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతున్నారు. ఎందుకంటే అధిక క్యాలరీలు లేని ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అదేవిధంగా రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో నైట్ నిద్రకి ఎటువంటి భంగం కలగదు. ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. అదే సమయంలో రాత్రి పడుకోవటానికి గంట ముందే ఆహారాన్ని తీసుకోవాలి. మరొకవైపు, మీరు రాత్రి భోజనాన్ని త్వరగా, తక్కువగా తింటే అది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీంతోపాటు అనేక రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం. బరువు తగ్గటానికి, రాత్రి భోజనంలో వీటిని తినండి.
Health Tips : రాత్రిపూట భోజనం ఇలా చేశారంటే ఈజీగా బరువు తగ్గవచ్చు..
బొప్పాయి సలాడ్….
ఈ పండు గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలన్నింటికీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతో గాను సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు భోజనాలు వీటిని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.
పెసర పప్పు…
పోషకాలు అధికంగా పెసరపప్పులో ఉన్నాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట భోజనంలో పెసరపప్పుని కచ్చితంగా తీసుకోవాలి.
సగ్గుబియ్యం ఖిచ్డీ…
ఈ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా తినడానికి తేలికగా ఉంటుంది. అందువల్ల రోజు రాత్రిపూట భోజనంలో వీటిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడానికి సగ్గుబియ్యాన్ని కడిగి ఐదు గంటల వరకు నానబెట్టండి. దీని తర్వాత గిన్నెలో నెయ్యి వేసి వేయించి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు ,జీలకర్ర వేసి కాసేపు వేయించండి ఆ తర్వాత బంగాళదుంపలు ,సెనగలు, కొత్తిమీర ,ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మకాయ పిండి తీసుకోండి