Anjali : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ షాపింగ్ మాల్ ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ భామకి తెలుగులో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో కంటే తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే అంజలి చేసిన ఒక తప్పు వలన ఆమె సినీ కెరీర్ నాశనం అయింది అంటున్నారు. అంజలి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రంలో అయినా చదువుకున్నది చెన్నైలో. అప్పట్లో అంజలి కాస్త స్లిమ్ గా, గ్లామర్ గా ఉండడంతో ఆమెను హీరోయిన్ గా ఉన్నావని అనేవారట.
దీంతో అంజలి కూడా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిందంట. ఈ క్రమంలోనే చదువు అయిపోయాక తమిళంలో అవకాశాల కోసం తిరిగిందట. చాలా ప్రయత్నాల తర్వాత షాపింగ్ మాల్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ కావడంతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
Anjali : అంజలి పేరుకే తెలుగమ్మాయి… చేసేవాన్ని బాలీవుడ్ పనులే…
అంజలి తెలుగు హీరోయిన్ అయినా ఇక్కడి దర్శక నిర్మాతలు ఎక్కువగా సినీ అవకాశాలు ఇవ్వకపోవడంతో చెన్నైకి వెళ్ళిపోయింది. ఆ మధ్యలో అంజలి అల్లు అర్జున్ ‘ సరైనోడు ‘ ఇటీవల నితిన్ ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇలా చేయడమే ఆమె చేసిన పెద్ద తప్పు అని కొందరు అంటున్నారు. స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ ఛాన్సులు రావని కొందరు అంటున్నారు. దీంతో అంజలి పేరుకే తెలుగమ్మాయి కానీ ఆమె బాలీవుడ్ హీరోయిన్స్ మెంటాలిటీ కలిగి ఉందని కొందరు విమర్శిస్తున్నారు.