Viral News : ఇటీవల హర్యానాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగల ముఠా కుటుంబ సభ్యుల కళ్ళముందే ముగ్గురు మహిళలపై సామూహిక హత్యాచారం చేసి వారింట్లోని నగదును మరియు బంగారాన్ని తీసుకొని పారిపోయారు. అయితే సంచలనం రేపుతున్న ఈ సంఘటన హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక సెప్టెంబర్ 21 రాత్రి జరిగిన ఈ ఘటన మట్లౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తుచేపట్టారు. అయితే అర్ధరాత్రి సమయంలో పదునైన కత్తులతో ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను తాళ్లతో బంధించారు. అనంతరం ఇంట్లోని మహిళలపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
అలాగే ఈ ఘటన జరిగిన కాస్త దూరంలో మరో మహిళపై కూడా ఈ దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఈ దుండగులు బాధితురాలి భర్తను తాళ్లతో కట్టేసి ఆమెపై ,క్రూర మృగాళ్ల ప్రవర్తించడంతో తీవ్ర గాయాలకు గురైన బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే జరిగిన ఈ రెండు ఘటనలలో నిందితులు మాత్రం ఒకరెనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక ఈ రెండు ఘటనలు ఒకే ప్రాంతంలో జరగడంతో ప్రస్తుతం ఈ న్యూస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పోలీసులు సిసిటీవీ ఫోటేజ్ లను పరిశీలిస్తూ దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దుండగుల ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.