Renu Desai : ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మరియు ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ఏదో ఒక విషయంలో తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరల సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్ అకిరా నందన్ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై తాను ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో చెప్పుకొచ్చారు.
అయితే అకిరా నందన్ పుట్టినరోజున నేను అనుకోకుండా నా బిడ్డ ఇంత పెద్దవాడయ్యాడనే ఆనందంలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకొని బర్త్డే విషెస్ తెలియజేశాను. అయితే ఈ ఫోటోలు చూసిన పవన్ అభిమానులు మాత్రం మా అన్న కొడుకు…మా అన్నయ్య బిడ్డ అంటూ పలు రకాల కామెంట్స్ తో ఆ ఫోటోలను కాస్త వైరల్ చేశారు. అయితే వారికి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టమే కాదనను కానీ అకిరా నాకు పవన్ కు ఇద్దరికీ బిడ్డనే కదా. ఇక మీ పవన్ కళ్యాణ్ అన్న కేవలం బయాలజీకల్ ఫాదర్ మాత్రమే..
ఆయన పిల్లని పెంచే తండ్రి కాదు.అందుకే నేను ఆయన గురించి ఎక్కువగా పట్టించుకోను. ఇక మీరు కూడా మీ పేరెంట్స్ కి పుట్టారు కదా. మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీరు కేవలం మీ నాన్న కొడుకు అంటే మీకు ఎలా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. బుద్ధిగా ఆలోచించండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. అకిరా పవన్ కుమారుడే కానీ అతనిని పెంచి పెద్ద చేసింది నేను అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. అందుకే ఆ సందర్భంలో తాను పవన్ అభిమానులపై మంటపడ్డానని రేణు దేశాయ్ తెలియజేసింది.