Viral News : చెన్నైలో దారుణం… ఇద్దరి ప్రాణం తీసిన AC…

Viral News  : ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. దీంతో ఎండను తట్టుకోలేక చాలామంది ఈ కాలంలో కూడా ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే చల్లని గాలిని ఇచ్చే AC కూడా కొన్ని సందర్భాలలో ప్రాణాలను కూడా తీసేస్తుంది. అదెలా అంటారా…! ఈమధ్య ఏసీలు తేలటం , షార్ట్ సర్క్యూట్ అవ్వడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. చెన్నై లోని ఓ సివారు ప్రాంతంలో నివాసముంటున్న తల్లి కూతుర్లను AC బలి తీసుకుంది. అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. తల్లి కూతుర్లు ఇంట్లో నిద్రిస్తుండగా శనివారం రోజు తెల్లవారుజామున ఏసీ పేలడంతో తల్లి కూతుర్లు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Advertisement

ac-took-the-lives-of-sleeping-mother-and-daughters

Advertisement

ఏసీ పేలుడు వలన సంభవించిన మంటలలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…. చెన్నైలోనే ఇందిరానగర్ సమీపంలో హలీన తన కూతురు నజియాతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆరోజు వారు ఇంట్లో ఏసీ వేసుకొని నిద్రిస్తుండగా అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. గది మొత్తం మంటలతో నిండిపోవడంతో తప్పించుకునే వీలు లేక తల్లి కూతుర్లిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

ac-took-the-lives-of-sleeping-mother-and-daughters

అందులోనూ అది అర్ధరాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు దీనిని గమనించలేకపోయారు. చాలాసేపటి తర్వాత కొందరు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఇంటి తలుపులను పగలగొట్టి చూశారు. అయితే అప్పటికే ఇంట్లోని వారు చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక వారి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీలో మంటలు చెలరేగాయని, అలాగే భారీగా పొగ రావడంతో ఊపిరాడక చనిపోయారని అధికారులు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement