Bigg Boss 7 : బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్ .. ఈసారి అతడి ఎలిమినేషన్ పక్కా..!!

Bigg Boss 7  : ప్రస్తుతం బిగ్ బాస్ 7వ సీజన్ నడుస్తుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ ఏడవ సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో దూసుకెళుతోంది. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉల్టా పుల్టా అంటూ సరికొత్త ట్యాగ్ లైన్ తో బిగ్బాస్ బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గత షోలలో వచ్చిన టాస్కులు కాకుండా కొత్తగా టాస్కులు ఇవ్వడంతో ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

unexpected-twist-in-bigg-boss-this-time-his-elimination-is-sure

Advertisement

అలాగే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎలిమినేషన్, నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చివరి వరకు తెలియకపోవడంతో ప్రజలు ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్ లో శివాజీ, శోభా శెట్టి, అమర్దీప్, టేస్టీ తేజా, ప్రిన్స్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈ వారంలో ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై ఉత్కంఠత పెరిగింది. ఓటింగ్స్ లో రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. తాజా ఓటింగ్స్ ప్రకారం మొదటి ప్లేస్ లో శివాజీ ఉన్నాడు. తర్వాత రెండవ ప్లేస్ లో ప్రిన్స్ ఉండగా, మూడవ ప్లేసులో అమర్దీప్ కొనసాగుతున్నారు.

unexpected-twist-in-bigg-boss-this-time-his-elimination-is-sure

ప్రియాంక నాలుగో స్థానంలో, శుభశ్రీ ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు. చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ ఉన్నారు. వీరిద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వారం టేస్టీ తేజా ఎలిమినేట్ కాబోతున్నాడని సమాచారం. గత వారంలో కూడా టేస్టీ తేజ ఓటింగ్ లో వెనుకబడ్డాడు. ఈసారి అతడి ఎలిమినేషన్ పక్కాగా ఉంటుందని సమాచారం. ఇక ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ లోకి ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 8న వీరి లాంచింగ్ ఉంటుంది. దీంతో ఈ షో ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement