Prabhas – Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి చేదు వార్త వినిపించనుంది. ఎప్పుడెప్పుడా అంటూ సలార్ మూవీ కోసం వెయి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురయింది. ఇక రేపో మాపో టీజర్ మరియు సినిమా సాంగ్స్ విడుదల అవుతాయని అనుకుంటున్న తరుణంలో మరోసారి సలార్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. అయితే ప్రభాస్ మరియు శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబాలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించి తర్వాత పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ సినిమాను డిసెంబర్ 22 న విడుదల చేయనున్నట్లు సినీ బృందం ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాలార్ సినిమా ఏప్రిల్ 24 న రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన సెప్టెంబర్ కి వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ లో కూడా దీనిని వాయిదా వేసి డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సీజీ వర్క్ పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారట. ఈ క్రమంలోనే మరో కొన్ని కొత్త షాట్స్ తీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా అనుకున్న టైం కి విడుదల చేయలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా మెల్లిగా చెప్పుకొస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న విడుదల చేయాల్సిన సలార్ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాక సినిమా విడుదలకు 50 రోజులు సమయం మాత్రమే ఉండగా…ఇప్పటివరకు మూవీ టీం ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా సలార్ వాయిదా పడే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దీపావళి కల్లా సలార్ సినిమా అప్డేట్ రానట్లయితే సలార్ డిసెంబర్ లో కూడాా ఈ సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక డిసెంబర్ లో సినిమా పోస్ట్ పోన్ అయితే వచ్చే ఏడాది మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రముఖులు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి కూడా ఈ సినిమా వాయిదా పడినట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు.