Andhra Pradesh : ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో వైసిపి మంత్రి రోజా మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి…ప్రజల డబ్బులను దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమాన పరుస్తున్నారని పేర్కొంది. నేను పుట్టి పెరిగిన తిరుపతిలో స్వాతంత్ర సంగ్రాణంలో పోరాటం చేసిన అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే రోజా మాటలకు స్పందించిన విశాఖపట్నం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇష్టానుసారం రెచ్చిపోయారు. అసభ్యకర రీతిలో మాట్లాడి రోజాపై మండిపడ్డారు.
అయితే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపైబండారు సత్యనారాయణమూర్తి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తి పై కేసు నమోదు చేసే చర్యలు తీసుకోవాల్సిందిగా పద్మ లేఖలో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న విశాఖపట్నం పరవాడ డిఎస్పి కెవి సత్యనారాయణ, సిఐ ఈశ్వరరావు గత అర్ధరాత్రి వేళజ్ భారీ పోలీసు బలగాలతో బండారు నివాసాన్ని చుట్టుముట్టారు. బండారి కి 41 ఏ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే అప్పటికే బండారి ఇంటి కి టిడిపి కార్యకర్తలు మరియు నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు టిడిపి నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఇక బండారి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అంటూ పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు.బండారి బిపి షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిందిగా టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ మరియు నారా లోకేష్ కు నోటీసులు జారీ చేయడం ఆంధ్ర రాజకీయాలను రసవత్తరంగా గా మార్చాయి.ఇక ఇప్పుడు బండారి కి నోటీసులు రావడంతో టిడిపి అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.