Devotional News : హిందువుల సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు ఇళ్లకు, షాపుల గుమ్మాలకు మిరపకాయ, నిమ్మకాయలను తాడుకి గూర్చి కడతారు. కానీ చాలామంది ఇదంత మూఢనమ్మకమని కట్టిపడేస్తారు. అసలు దీని గురించి వేదపండితులు ఏమంటున్నారో తెలుసా. పెద్దల మాట పెరుగన్నం మూట అంటారు. పెద్దలు చెప్పిన కొన్ని పద్ధతులను ఆచరించవలసి ఉంటుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో ఏమాత్రం చాలామందికి తెలియదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, పూర్వం రోజుల్లో మాపెద్ద వారంతా ఇలాగే చేసేవారు అని చెప్తారు.
ఇలా సరైన కారణం తెలియక మూఢ నమ్మకంగా నమ్ముతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి ఇల్లు, వ్యాపారసంస్థల ముందు కట్టే నిమ్మకాయ ,మిరపకాయలా గుత్తి.ఇల్లు, షాపుల గుమ్మాలకు మిరపకాయ, నిమ్మకాయలను ఎందుకు కడతారో తెలుసుకుందాం.తెలుగువారు చాలామంది ఈ పద్ధతిని నమ్ముతారు. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలను ద్వారానికి గుచ్చి కడతారు. ఎందుకు ఇలా కడుతున్నారని అడిగితే నర దిష్టి పోతుందని కొందరు, మరికొందరు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు. ఇలా చేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి రావని మరికొందరు అంటారు. కానీ సైన్స్ మాత్రం ఇలా అంటుంది.
Devotional News : మీ ఇళ్లు, షాపుల గుమ్మాలకు మిరపకాయ, నిమ్మకాయలను కడితే మంచి ఫలితం ఉంటుందట

నిమ్మకాయ, మిరపకాయ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని గుమ్మానికి గుచ్చడం వల్ల నిమ్మకాయ రసం మిరపకాయలోకి ఆవిరి రూపంలో చేరి, ఈ ఆవిరి గాలిలో కలిసినప్పుడు శ్వాసకోస సమస్యలకు చెక్ పెడుతుంది.పూర్వం చాలామంది పేడతో అలికి నా ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో ఇంట్లోకి పురుగులు, దోమలు, ఈగలు ఎక్కువగా వచ్చేవి, ఇలా నిమ్మకాయ, మిరపకాయలను గూర్చి గడపకు వేలాడదీస్తే పురుగులు వచ్చేవి కాదు. మిరపకాయ, నిమ్మకాయలను ద్వారానికి కడితే పురుగులను ఇంట్లోకి రాకుండా కాపాడుతాయి. అందుకే ద్వారానికి ఎదురుగా కట్టేవారు.
కానీ జ్యోతిష్య శాస్త్రం ఇలా అంటుంది. వ్యాపార సంస్థలకు ఇల్లు, ఇంట్లో ఉండే వారి ఎదుగుదలను చూసి, కొందరి కంటి చూపు వల్ల దిష్టి తాకుతుంది. అలాంటి దిష్టి ని తొలగించడం కోసం నిమ్మకాయ, మిరపకాయలను గుమ్మాలకు కడతారు అని చెబుతారు పండితులు. మూఢనమ్మకాలను నమ్మనివారు ఈ విషయాలను నమ్మనవసరం లేదు, కానీ పెద్దలు చెప్పిన ప్రతి విషయం వెనక శాస్త్ర కారణం ఉంటుందని గ్రహిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.