Raghvendra rao : తెలుగు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితుడు. రాఘవేంద్రరావు దాదాపు మూడు తరాల సూపర్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి ప్రేక్షకులని బాగా మెప్పించి విమర్శకుల మన్ననలను పొందాడు. రాఘవేంద్రరావు గారి సినిమాలో ఏ తరానికి గమనిస్తే ఆ తరనికి తగ్గట్టుగా ప్రక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన తీసిన జనపదమైనా, పౌరనికమిన తనదైన శైలిలో చిత్రాలను తెరకు ఎక్కించే వారు. అంత గొప్పగా చిత్రాలు తీశాడు కాబట్టే ప్రేక్షకులు అతనికి బ్రహ్మరథం పట్టారు.
రాఘవేంద్రరావు గారు తెలుగు సినిమాలో జనరేషన్ తగ్గట్టుగా తను మారుతూ తన హీరోలతో మరియు హీరోయిన్ లతో హావభావాలు పలికించేవవడు. యాక్షన్ సినిమాలకు గ్లామర్ టూచ్ ఇస్తూ సమయానికి అనుగుణంగా చిత్రాలను తెరపైకి ఎక్కిస్తూ అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంసాదిచుకున్నడు. తను చేసిన ప్రతి సినిమా లో నవరసాలను చూపిస్తూ ఎక్కడ ఎక్కడ హీరోతో సాహసాలు చేపుంచలి, ఎక్కడ ఎక్కడ హీరోయిన్లతో గ్లౌమర్ టచ్ ఇవ్వాలి, విలన్ పాత్రను ఎలా చిత్రీకరించాలో ఆయనకు తెలిసంతగ ఎవరికి తెలీదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా ప్రేక్షక లోకానికి దగ్గర అవుతూ తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు.

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని గొప్ప వారు అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారే తమ ఆటోబయోగ్రఫీ ని రాయడానికి సుముఖత చూపలేదు, కానీ రాఘవేంద్రరావు అందుకు భిన్నంగా తన సినిసప్రయాణాన్ని అందరికీ తెలియాలి అన్న ఆసక్తి తో తన బయోగ్రఫిని పుస్తక రూపంలో అవిస్కరిస్తున్నడు. “నేను సినిమాకు రాస్తున్న ప్రేమలేఖ” అనే పుస్తకంలో తను మొదటి నుంచి సినిప్రయణంను వివరిస్తూ తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు.
ఈ పుస్తకం చేతన్ భగత్ బుక్స్ పబ్లిష్ చేసి మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకం ఖరీదు 200, సానియా మీర్జా జీవిత చరిత్ర పుస్తకం 300 ఉన్నాయి. కానీ రాఘవేంద్రరావు ఆటోబయోగ్రఫీ మాత్రం 3వేలు గా నిర్ణయించటం విశేషం. ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవారు చాలా తక్కువ, అలాంటిది ఈ పుస్తకానికి 3వేలు గా నిర్ణయించటం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది. కాగా రాఘవేంద్ర రావుగారు ఈ పుస్తకం లో అన్ని రుచుల సమ్మేళనం గ ఉంటుంది అని ముందుగానే క్లు ఇవ్వటం జరిగింది….