Anil Ravipudi : అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ ఈ పేరు అందరికీ బాగా తెలిసి పోయింది. నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రం తో డైరక్టర్ గా తెలుగులో మొదటి సినిమా చేశాడు, సుప్రీమ్ సినిమా తో సాయి ధరమ్ తేజ్ తో ఇండస్ట్రీలో తనకు అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రజ దీ గ్రేట్ చిత్రం తో మస్ మహరాజ్ రవితేజ పాత్రను చూపించిన విధానం తో ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయిపోయాడు. తర్వాత F2 చిత్రం తో కుటుంబ కథతో మరియు కామిడీ తో ప్రేకకులను బాగా ఆకట్టుకున్నాడు. F2 తో అనిల్ రావిపూడి కి మరింత క్రేజ్ పెరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరి లేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ డైరక్టర్ జాబితాలో అనీల్ రావిపూడి చేరిపోయాడు. F2 సీక్వెల్ గా తీసిన F3 మూవీ మే 27 తారీకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఎవరైనా ఉంటారా. అయన డైలాగ్ డెలివరీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాదో అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో 2021 డిసెంబర్ వచ్చిన అఖండ చిత్రంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరపాన్ని చూపించాడు, అఖండ డైలాగ్ డెలివరీ లో ఆయనకు ఆయననే సాటి.

అయితే అనిల్ రావిపూడి మరియు నదమురి బాలయ్య క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయాలని చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ క్రేజీ మూవీ తెరకు ఎక్కించనున్నట్లు అనుకుంటున్నారు. త్వరలోనే బాలకృష్ణ 108 వ సినిమాగా ఈ మూవీ అధికారం గా ప్రకటన చేయనున్నట్లు వినికిడి. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణి నటించనున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి బాలయ్య సినిమా లో అవకాశం దక్కడం అంటే ఈ సీనియర్ హీరోయిన్ కి అందరు లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని అందరూ అనుకుంటున్నారు.