Health Benefits : నేటి ప్రపంచంలో స్త్రీలు రోజంతా పనిచేసే ఉద్యోగాలంటూ తిండి నిద్ర మానేసి పనిలో బిజీ అయిపోతున్నారు. మరి కొంతమంది మహిళలు సరి అయిన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వివిధ రకాల రోగాలకు గురి అవుతున్నారు. ఇలా చేయడం వల్ల స్త్రీలకు జీవితంలో ముందు ముందు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలో ప్రోటీన్ లోపం వల్ల స్త్రీలకు పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనలు చెబుతున్నారు.
రోజు స్త్రీలు తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందకపోవడంతో గుండెపోటు లేదా కోరోనరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలియజేశారు. రోజు 110 గ్రాముల ప్రోటీన్లు తీసుకోలేకపోవడం వల్ల స్త్రీలకు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ వయసుకు తగినట్లుగా అందకపోవడం వల్ల స్త్రీల ఎముకలు బలహీన పడడం, కండరాలు బలహీనంగా తయారవుతాయని పరిశోధనలలో తెలిసింది.
Health Benefits : స్త్రీలకు సరైన మోతాదులో ప్రోటీన్ అందకపోతే ఏం జరుగుతుంది తెలుసా.?

రోజుకి మహిళలు కనీసం 42 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని చెబుతున్నారు. వారు సరియైన సమయానికి ప్రోటీన్ తీసుకోలేకపోవడం వల్ల ఎంజైన్లు, శరీర కణాలు, ప్రతిరోధకాలు మరియు కండరాలను నిర్మించడంలో ఆమ్లాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అదేవిధంగా మహిళలు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే బరువు పెరగడం, మూత్రపిండాల సంబంధిత సమస్యలు మొదలవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు