Friday Remedies : శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మహిళలు పూజిస్తారు. అంతేకాకుండా మీ జీవితంలో శుక్ర దోషం తొలగిపోవాలంటే… శుక్రవారం రోజున వీటిని దానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటంటే.ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. శుక్రవారం నాడు ఆ అమ్మవారికి ఖీర్ ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత పేదలకు పంచి పెట్టాలి.
Friday Remedies : ఈ వస్తువులను శుక్రవారం రోజున దానం చేసినట్లయితే…
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజు చాలా ప్రత్యేకమైనది. ఈనాడు వివాహిత స్త్రీలు తమ చేతులతో ఎర్రటి గాజులు, ఎర్రటి చీర, కుంకుమ, మెహందీ 16 వస్తువులను దానం చేస్తే. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ రోజున వస్త్ర దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నులై తమ కోరికలు త్వరగా నెరవేరుతాయి. స్త్రీలు తమ దగ్గర బంధువులకు పట్టు వస్త్రాలను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు మేలుకుంటాయి.
తెల్లటి వస్త్రాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అందుకే లక్ష్మీ పూజలో తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా వాడాలి. శుక్రవారం ఈరోజు వస్తువులను దానం చేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజున తెల్లచందనం, వెండి, పంచదార, అన్నం, పాలు, పెరుగు మొదలైన వాటిని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడంతో పాటు శుక్ర దోషం కూడా దూరమవుతుంది.