Health Benefits : ప్రతిరోజు మనం ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి మంచి పోషకాహారం వీటితో పాటు వివిధ రకాల పండ్లను తీసుకుంటాం. కానీ ప్రకృతి వల్ల ఏర్పడిన పండ్లను తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి పండ్లలో ఒకటి నేరేడుపండు. ఈ పండు ని పోషకాల పుట్ట అని పిలుస్తారు ఇవి ఆరోగ్యసమస్యలను దూరం చేసి మనకు చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి నేరేడు పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఒక్కటే కాదు ఆకులు.. బెరడు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు.నేరేడు పండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సోడియం, విటమిన్ సి, పోలిక్ యాసిడ్, పీచు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్న వారికి నేరేడు పండ్లు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయి. నేరేడు పండ్లు తినడం వల్ల పొట్టలో పేరుకు పోయిన మలినాలను, వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. ప్రేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను మలం ద్వారా బయటకు పంపుతాయి మన శరీరానికి ఈ పండును తినడం ద్వారా అధిక వేడిని తగ్గించి బాడీ చల్లగా ఉండేలా చేస్తుంది. ఈ పండు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి రక్త శుద్ధి జరుగుతుంది మహిళలకు నెలసరి సమయంలో వీటిని తినడం వల్ల. నడుము నొప్పి తగ్గి నీరసపడిపోయేవారికి వెంటనే శక్తి అందుతుంది. మన శరీరానికి సరిపడా ఐరన్ లభిస్తుంది.కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. వెన్నునొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
Health Benefits : నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో

బంక విరోచనాలు తో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని తీసుకుంటే ఉపశమనం వుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయం సంబంధిత సమస్యలను దూరం చేస్తాయని వైద్యనిపుణులు తెలియజేశారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు ,మెదడుకు మంచి ఔషధంగా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్వరంతో బాధపడే వారికి నేరేడు పండ్లు రసం, ధనియాల రసం కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం ఉంటుంది. ఈ పండ్లలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మలబద్దక, గ్యాస్, ఉబ్బసం, వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేసి జీర్ణవ్యవస్థకు సంబంధిత వ్యాధుల ను కంట్రోల్ చేస్తాయి.