Rain Bugs : ఆరుద్ర పురుగులకు… వర్షాలకు సంబంధం ఏమిటి?

Rain Bugs : ఆరుద్ర కార్తె అంటే ఇక వర్షాలు ప్రారంభమైనటే ఈ కార్తె లో వర్షాలు జోరుగా కురుస్తాయి. ఈ సంవత్సరం వర్షపాతం, పంటలు ఎలా ఉంటాయో ఆరుద్ర పురుగులు రైతులకు ముందుగా తెలియజేస్తాయట. జూన్ 22న బుధవారం రోజు నుంచి ఈ కార్తె ప్రారంభం కానుంది. ఎర్రటి ఎండకు నెరలిచ్చిన భూమి తొలకరి చినుకులు కోసం తపించిపోతుంది. మెరుపు మెరిసి, మేఘాలు ఉరిమి, చినుకు పడగానే భూ తల్లి తన సంతోషాన్ని పట్టలేక మట్టి పరిమళంగా వెదజల్లుతుంది.

Advertisement

ఆ చినుకు పడగానే భూమి లోపల నుంచి బిలబిలమంటూ ఎర్రటి పురుగులు బయటకు వస్తాయి. ఆ ఎర్రటి పురుగుల ని ఆరుద్ర పురుగులు అంటారు. ఆరుద్ర కార్తె ప్రారంభంలోనే ఇవి కనిపిస్తే ఆ సంవత్సరం మంచి వానలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. అయితే ఆరుద్ర పురుగులు కనిపిస్తే రైతులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పురుగులు కనిపిస్తే వర్షాలు బాగా కురుస్తాయి అని రైతులు భావిస్తారు. ఇవి కనిపించగానే రైతులు తన వ్యవసాయ పనులను సంతోషంగా ప్రారంభిస్తారు.
రైతుల వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే ఆరుద్ర కార్తె అనుకూలమైంది.

Advertisement

Rain Bugs : ఆరుద్ర పురుగులకు… వర్షాలకు సంబంధం ఏమిటి?

relationship between rain bugs and rains
relationship between rain bugs and rains

ప్రతి సంవత్సరం ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే కనిపించే ఈ పురుగులు ఈ ఏడాది తొందరగా కనిపించాయి. అంటే ఈ ఏడాది వర్షపాతం తొందరగా ప్రారంభమవుతుందని అర్థం. పంట పొలాల్లో ఎక్కడ చూసినా ఈ ఆరుద్ర పురుగులు కనిపించేవి. అయితే రానున్న రోజుల్లో మందుల వాడకం ఎక్కువై నేలతల్లి కాలుష్యం తో నిండి పోతుంది. దీంతో ఆరుద్ర పురుగులు నశించి పోతున్నాయి. ఈ సంవత్సరం అనుకున్న సమయం. కంటే ముందే కనిపించడంతో రైతులు సంతోషంతో పంట పొలాల్లో పనులను ప్రారంభిస్తున్నారు.

Advertisement