పర్యావరణానికి మేలు చేసేలా ఇప్పటికే విద్యుత్ ఆధారిత వాహనాల తయారీని ప్రోత్సహిస్తోన్న కేంద్రం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.
చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకునే లక్ష్యంతో పెట్రోల్ లో ఇథనాల్ కలిపి వినియోగించడాన్ని మరింత ప్రోత్సహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీని వలన వాహనదారులకు కూడా మేలు జరుగుతుందని చెప్పింది.
ఎందుకంటే లీటర్ పెట్రోల్ ధర.120 ఉంటే ఇథనాల్ కేవలం రూ.60మాత్రమేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం 20శాతం ఇథనాల్ ను కలిపి పెట్రోల్ ను వినియోగిస్తున్నారు. దీంతో రైతులకు కూడా లాభం చేకూరుతోందన్నారు. అందుకే ఇథనాల్ తో నడిచే వాహనాలను భవిష్యత్ తీసుకురానున్నట్లు చెప్పారు.
నాగ్ పూర్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. భవిష్యత్ లో అని విద్యుత్ ఆధారిత వాహనాలను తీసుకురానున్నట్లు తనతో మెర్సిడెజ్ బెంజ్ చైర్మన్ చెప్పారని గుర్తు చేసిన గడ్కరీ…అందుకే ఇకపై ఇథనాల్ తో నడిచే వాహనాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు.