విడాకులకు రెడీ అయిన యాదమరాజు – స్టెల్లా దంపతులు..?

బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాదమరాజు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. స్టెల్లాతో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Advertisement

యాదమరాజు- స్టెల్లాలు విడాకులకు రెడీ అయ్యారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే విడాకులకు రెడీ అయ్యారా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

గతేడాది యాదమరాజు – స్టెల్లాలు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. యాదమరాజు జబర్దస్త్ ద్వారా అలరిస్తుండగా…స్టెల్లా ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను చేస్తోంది. ఈ మధ్యనే ఓ డ్యాన్స్ షోకు జంటగా హాజరైన వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు.

జబర్దస్త్ వేదికపై కూడా విడాకులను అనౌన్స్ చేశారు కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. యాదమరాజు – స్టెల్లాలు కలిసి ఓ స్కిట్ చేశారు. ఇందులో ఇద్దరు కలిసి విడాకులు తీసుకుంటున్నట్లు స్కిట్ చేశారు. నీతో నా వల్ల కావడం లేదు… నాకు డివోర్స్ కావాలని స్టెల్లా అడుగుతుంది. వేరెవరూ కోరని విధంగా ఆ విడాకులు తంతు ఓ ఫంక్షన్ లా జరగాలని యాదమరాజు  కోరుతుంది.

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో విడుదల అయింది. అయితే స్కిట్ ప్రమోషన్ కోసం ఇలా విడాకులు తీసుకుంటున్నట్లు నటిస్తారా..? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement