Dream : కలలో ఇవి కనిపిస్తే త్వరగా చనిపోతారట.. ఆ కలలు మీకు వచ్చాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి

Dream : మనిషి ఏదైనా సాధాంచాలనుకొని సాధించలేకపోయినా.. దేని గురించైనా బాగా ఆలోచించినా.. ఆ రోజు ఏ పనులు చేసినా.. రాత్రి పూట అవే కలలోకి వస్తుంటాయి. నిజానికి మనిషి జీవితంలో సగ భాగం నిద్రకే పోతుంది. ఇక సగ భాగం మాత్రమే అసలు జీవితం. సగ భాగం అయిన నిద్ర లేకుండా మనిషి బతకలేడు. అయితే.. మనిషికి నిద్రలోనూ ఓ జీవితం ఉంటుంది. రాత్రి పడుకున్నాక చాలామందికి ఎన్నో కలలు వస్తుంటాయి. కొన్ని కలలు వాళ్లకు తెల్లారాక గుర్తుంటాయి. మరికొన్ని గుర్తుండవు.

if you dream about these things you will be dead
if you dream about these things you will be dead

అయితే.. గాఢ నిద్రలోకి వెళ్లాక.. రాత్రి పూట 3 నుంచి 4 గంటల సమయంలో వచ్చే కలలే అసలైన కలలట. వాటినే నిజమైన కలలుగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంతే కాదు.. ఆ సమయంలో వచ్చే కలలే నిజం అవుతాయట. అయితే.. ఆ సమయంలో ఎటువంటి కలలు వస్తాయో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు కొన్ని రకాల కలలు వస్తే మాత్రం అస్సలు మంచిది కాదట. అరిష్టం అని కొందరు పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఎటువంటి కలలు రాకూడదో… అవి వస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Dream : దున్నపోతు కనిపించకూడదు.. జుట్ట విరబోసుకున్న స్త్రీ కనిపించకూడదు

మీకు 3 నుంచి 4 మధ్య కలలో దున్నపోతు కనిపించినా.. నూనె కనిపించినా.. జుట్టు విరబోసుకున్న మహిళ కనిపించినా త్వరగా చనిపోతారట. మలం కూడా కనిపించకూడదట. అంతే కాదు.. వీటి వల్ల అరిష్టం అట. కలలో మనకు మనమే నగ్నంగా కూడా కనిపించకూడదట. అలా కనిపించినా త్వరగా చనిపోతామని అర్థం. అయితే.. కలలో జంతువులు కనిపిస్తే మంచిది. కాకపోతే కోతి కనిపిస్తే మాత్రం ఏదో కీడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి.