Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి దక్కినటువంటి అరుదైన గౌరవం లభించింది. బన్నీని న్యూయార్క్ లో ఆగస్టు 21 తేదీన జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పెరేడ్ కి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూయార్క్ లో జరిగే ఇండియా అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళబోతున్నాడని విషయం తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధికారికంగా ప్రకటిస్తూ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళుతున్నట్లు తెలియజేసింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి కెన్నీ దేశాయ్ అల్లు అర్జున్ ఆగస్టు 21వ తేదీన జరిగే 40వ భారత స్వాతంత్ర దినోత్సవ పేరేడ్ కి నాయకత్వం వహిస్తున్నారని అధికారికంగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనకి అరుదైన గౌరవం లభించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అల్లువారు ఫ్యామిలీ నుండి సినిమాల వైపు వెళ్లిన అల్లు అర్జున్ అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచారు. స్టైలిష్ స్టార్ గా మరియు ఐకానిక్ స్టార్ గా అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నాడు.
Allu Arjun : న్యూయార్క్ లో గ్రాండ్ మార్షల్ ఇండియా డే పెరేడ్ కి అల్లు అర్జున్ కు ఆహ్వానం.
ఇప్పుడు ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అయితే ప్రేక్షకులు ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారంటే చెప్పవచ్చు. అల్లు అర్జున్ కి ఎంత ఫాలోయింగ్ పెరిగిపోయిందో. ఈమధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో ఈ ఇండియా లెవెల్ లో బన్నీ పేరు మారిమోగి పోయింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తనని మార్చుకున్న తీరు ప్రేక్షకులు ను విశేషంగా ఆకట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కాస్త గ్యాప్ దొరకగానే ఫ్యామిలీతో ట్రిప్పు వేస్తూ ఫారెన్ లో ఎంజాయ్ చేస్తూ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో షికారు చేస్తున్నారు