kamal hasan : తెలుగు తమిళ చిత్రసీమలో పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. దక్షణ భారతదేశపు తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించినప్పటికీ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన నటుడు. ఈయన నటనకు గానూ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులును అందుకున్నాడు. ఐదు భాషల్లో నటనకు గాను ఐదు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి కమలహాసన్. దీనిని బట్టి చెప్పవచ్చు ఆయన ఎంత ప్రతిభావంతుడో చెప్పవచ్చు. ఆయన బాలనటుడిగా నటించిన మొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్నాడు అంటే ఆయనకు నటన అంటే అంత ఆసక్తి ఉందో దీనిని బట్టి చెప్పవచ్చు. సౌత్ ఇండియా తరుపున ఎక్కవ ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విలక్షణ నటడు కమల్ హాసన్.
కమల్ హాసన్ తాజాగా హీరో మరియు సహనిర్మతగా చేసిన చిత్రం విక్రమ్. ఈ సినిమాకు దర్శకుడిగా లోకేష్ కనకరజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తో పాటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్ కూడా నటిస్తున్నారు. విక్రమ్ చిత్రం ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ. సినిమా కమల్ హాసన్ నటిస్తున్న 232 చిత్రం విశేషం. విక్రమ్ సినిమా కోసం కమల్ ఎప్పటినుంచో చేస్తున్న బిగ్ బాస్ హోస్టింగ్ ను కూడా వదులుకున్నారు.

కమల్ హాసన్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సీక్వెల్ గా ఇండియన్2 ను మొదలుపెట్టి ఆ నిర్మాణ సంస్థ అయిన అటువంటి లైక నిర్మాణ సంస్థ డైరెక్టర్ శంకర్ మధ్య వివాదం తో మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా ఇక దాదాపు పూర్తిగా ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఈ చిత్రంపై ఆశలు పోలేదు. కావునా తానే స్వయం లైకా నిర్మాణ సంస్థతో చర్చలు జరిపి తానే పూర్తిగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ ఇండియన్2 మీద ఉన్న ఆసక్తి తో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎం చేస్తాడా వేచి చూడాలి….