Vijay Devarakonda : విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు చిత్రం తో హీరోగా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తరువాత దేరకా సినిమా అంతగా మెప్పించలేదు, వెనువెంటనే వచ్చిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో అందరి చూపును తనవైపు తిప్పుకొని తన విలక్షణమైన నటనతో తనకంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నడు. తరువాత వచ్చిన గీతా గోవిందం, టాక్సీవాల, నోటా, మహానటి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో అందరి మనసుల్లో సుస్థిర సంస్థానం సంపాదించుకున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న మన తెలుగు రౌడీ విజయ దేవరకొండ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. ఈ చిత్రాలు అన్ని దాదాపు చివరి దశలో షూటింగ్ లో ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం ద్వారా ధర్మా ప్రొడక్షన్ లో తెరకు ఎక్కుతున్న పన్ ఇండియా మూవీ దాదాపు పూర్తి కావడం జరిగింది. ఈ మూవీ లో అనన్యా పాండే విజయ్ దేవరకొండలో జోడీ గా నటిస్తుంది. ఎదేకకా మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న ఖుషి సినిమా లో విజయ్ కి జోడీ గా సమంతా నటిస్తుంది, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్యనే రిలీజ్ చేయటం జరిగింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు మళ్ళీ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన చిత్రంలో సమంతతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రం లో సమంతా యశోద పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్ మేజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై తెరకు ఎక్కనుంది.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న అన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి, కావున తన తర్వాత సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ ఇంద్రగంటి కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది