ఆ భయమే కేసీఆర్ మౌనానికి కారణమా ..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారు. ఆయన ఏమి మాట్లాడటం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతం పలకకపోవడమే తాను చేసిన పెద్ద పోరాటమని అనుకుంటున్నారు తప్పితే ఇతర మార్గాల్లో కేసీఆర్ ఏవిధంగానూ మోడీపై పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీపై శివాలెత్తే కేసీఆర్ ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ప్రధానిపై విమర్శల జడివాన కురిపించడం కాదు కదా ఆయన పెరేత్తెందుకే వెనకడుగు వేస్తున్నారు. మోడీపై విమర్శలు చేయాల్సి వస్తే లైవ్ కెమెరాలను ఆఫ్ చేయించి విమర్శలు చేస్తున్నారు.

Advertisement

కేంద్రంపై కేసీఆర్ మునుపటిలా గర్జించడం లేదు. ఎందుకొచ్చిన తలనొప్పి. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి కొని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరును సైతం తెరమీదకు తెస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల విచారించిన సీబీఐ.. బీఆర్ఎస్ చీఫ్ తోనున్న ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ప్రగతి భవన్ మరింత అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అసలే లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో కేసీఆర్ కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ఆయన విశ్వసనీయతే ప్రమాదంలో పడుతోంది.

Advertisement

ఢిల్లీ రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తోన్న కేసీఆర్ వ్యూహాత్మక వ్యూహం వహిస్తున్నారు. కేంద్రంపై ఏమాత్రం తోక జాడిచిన కేసీఆర్ తోక కత్తిరించేందుకు కాచ్చుకుచ్చుంది. బీజేపీపై పోరాటం అంటోన్న కేసీఆర్ విపక్ష పార్టీలను ఏకం చేయడంలో మునుపటి చొరవ చూపడం లేదు కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం వరుసగా విపక్ష నేతలను కలిసి ఐక్యం చేసే పనిలో పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం ఎవరిని కలిసేందుకు ఇష్టపడటం లేదు. పరిస్థితిని చూస్తుంటే యుద్ధం ప్రారంభించకుండానే కేసీఆర్ ఓటమి అంగీకరించినట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది.

Advertisement