విజయసాయిని వైసీపీ నుంచి గెంటేసిన జగన్..?

వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసింది. ఏపీ సీఎం జగనే ఈ విషయాన్ని ప్రకటించారు. విజయసాయిరెడ్డి పార్టీకి సంబందించిన అన్ని వ్యవహారాలను చూసుకోలేడు…పార్టీ అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా బాధ్యతలను మోయలేడు. అందుకే ఈ బాధ్యతలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు గడపగడపకూ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే విజయసాయిరెడ్డిని పక్కనపెడుతున్నట్లు జగన్ ఓపెన్ గా ప్రకటించారు.

Advertisement

కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు విజయసాయిరెడ్డి. తారకరత్న మరణం తరువాత విజయసాయి రెడ్డి చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించారు. బంధువుల కన్నాచంద్రబాబుతో కనిపించారు. రాజకీయ విబేధాలు కూడా లేవన్నట్లు కలిసిపోయారు. చంద్రబాబు అంటేనే ఎకిపారేసే విజయసాయి రెడ్డి ఆయనతో అలా కనిపించడం వైసీపీ వర్గాలకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కాలేదు. సోషల్ మీడియాలో తన దూకుడును తగ్గించేశారు.

Advertisement

ఆ మధ్య మళ్ళీ రివ్యూలు నిర్వహించి మునుపటి విజయసాయిరెడ్డిని పరిచయం చేశారు. మళ్లీ ట్విట్టర్ ఖాతాను రీయాక్టివ్ చేశారు. మళ్ళీ రాజకీయ అంశాలపై స్పందిస్తూ ప్రత్యర్ధులపై ట్వీట్లు చేశారు. కానీ అనూహ్యంగా విజయసాయిరెడ్డిని పక్కకు తప్పించారు. పార్టీకి నీ సేవలు చాలునని పక్కకు తప్పించారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి కంటే పెద్ద వయసున్న నేతలు వైసీపీలో అధికం. వారందరికీ లేని నిబంధనలు, సర్టిఫై విజయసాయికే జగన్ చూపుతుండడం విశేషం.

Advertisement