లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన ఈడీ- చార్జీషీట్ లో కవిత భర్త పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మూడో చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ అందులో సంచలన విషయాలను ప్రస్తావించింది. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి కీలక అభియోగాలను మోపింది. చార్జీ షీట్ లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావివించిన ఈడీ… అందులో కవిత భర్త అనిల్ పేరును కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది.

Advertisement

లిక్కర్ స్కామ్ లో అందిన ముడుపులతో కవిత హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారని పేర్కొన్న ఈడీ…తనకున్న పవర్ తో చాలా తక్కువ రేట్లకే ఆమె భూములు కొనుగోలు చేశారని ప్రస్తావించింది. ఈ వ్యవహారాలన్నీ అరుణ్ పిళ్ళై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. పలువురు కవిత సన్నిహితుల పేర్లను చార్జీషీట్ లలో పేర్కొంది ఈడీ. కవిత సన్నిహితులు వి. శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి, ఫీనిక్స్ శ్రీహరి పేర్లను చేర్చింది. మరోసారి అరుణ్ పిళ్ళైను కవిత ప్రతినిధిగా చార్జీషీట్ లో పేర్కొంది.

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూడో చార్జీషీట్ లో కవిత పేరును మరోసారి ఈడీ ప్రస్తావించడం.. ఆమె భర్త పేరు కూడా పేర్కొనటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈడీ దూకుడు చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే కవితను మరోసారి విచారణకు హాజరు కావాలని నోటిసులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయిందని… మూడువారాలు రెస్ట్ అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో కవిత పోస్ట్ చేయడంతోనే ఈడీ కాస్త వేచి చూసే ధోరణి అవలంభించినట్లు తెలుస్తోంది.

కవితను ఈడీ విచారణకు మరోసారి పిలిస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తాజా పరిణామాలతో స్పష్టం అవుతోంది.

Advertisement